ఊరుకొండ ఎస్సైగా లక్ష్మణ్…

share on facebook

ఎస్సై కావలి రాజు బదిలీ వెనక ఆంతర్యం ఏమిటి..?
ఊరుకొండ, ఆగస్టు 12 (జనం సాక్షి):
ఊరుకొండ మండల నూతన ఎస్సైగా లక్ష్మణ్ శుక్రవారం బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు. ఊరుకొండ మండల ఎస్సైగా గత మూడు నెలలుగా విధులు నిర్వహించిన కావలి రాజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని డి సి ఆర్ బీ ఎస్సైగా బదిలీ కాగా, డి సి అర్ బీ లో విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ ఊరుకొండ కు బదిలీపై వచ్చినట్లు సమాచారం. ఊరుకొండ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కావలి రాజు అతి తక్కువ వ్యవధిలోనే… మూడు నెలలు ముగిసేసరికి బదిలీ వేటు పడడంతో పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ నాయకుల మాట వినకపోతే గతంలో కూడా ఊరుకొండలో విధులు నిర్వహించిన ఎస్సైలు బదిలీలు అయిపోయిన సందర్భాలు లేకపోలేదని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎస్సై కావలి రాజు బదిలీ వెనుక ఏదో తెలియని అంతర్యం దాగి ఉంటుందని మండలంలోని ప్రతిపక్ష పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు చర్చించుకుంటున్నారనే గుస గుసలు వినిపిస్తున్నాయి.

Other News

Comments are closed.