ఎంపి కవితకు కెసిఆర్‌,కెటిఆర్‌ల జన్మదిన శుభాకాంక్షలు

share on facebook

హైదరాబాద్‌,మార్చి13(జ‌నంసాక్షి):  టీఆర్‌ఎస్‌ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఎంపీ కవితకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎమ్మెల్యే హరీష్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆనందం, ఆరోగ్యం, శాంతితో ప్రజాసేవలో సుదీర్ఘ కాలం
కొనసాగాలని కేటీఆర్‌ ఆశీర్వదించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు కూడా కవితకు బర్త్‌డే విషెస్‌ చెప్పారు.  నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల జన్మదినం పురస్కరించుకుని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేవుడి ఆశీస్సులతో ప్రజాసేవలో కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. ఎంపీ కవిత సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కోరారు.

Other News

Comments are closed.