ఎంపి కవితతో మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్‌ గౌడ్‌ భేటీ

share on facebook

హైదరాబాద్‌,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): కొత్తగా మంత్రులుగా మంగళవారం ప్రమాణం చేసిన ఎర్రబెల్లి దయాకర్‌ రావు, శ్రీనివాసగౌడ్‌లు నిజామాబాద్‌ ఎంపి కవితను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తమకు మంత్రిగా పనిచేసే అవకావం రావడం పట్ల వారు తమ ఆనందాన్ని ఆమెతో పంచుకున్నారు. సిఎం కెసిఆర్‌తో పనిచేసే అదృష్టం వచ్చిందన్నారు. తెలంగాణ ఆకాంక్షలకు అనగుణంగా కెసిఆర్‌తో కలసి నడుస్తామని దాయకర్‌ రావు అన్నారు. అలాగే  రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌ నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవితను  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి హైదరాబాద్‌లోని ఎంపీ నివాసానికి విచ్చేశారు. ఎంపీ కవిత.. శ్రీనివాస్‌గౌడ్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ కేబినెట్‌లో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మరింత పేరు తెస్తానని మంత్రి పేర్కొన్నారు.

Other News

Comments are closed.