ఎంసీ కోటిరెడ్డికి బీ`ఫామ్‌ అందజేసిన మంత్రి జగదీష్‌ రెడ్డి

share on facebook

నల్లగొండ,నవంబర్‌ 23 (జనంసాక్షి):   ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల కోటా శాసనమండలి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డిని సీఎం కేసీఆర్‌ ఖరారు చేయగా బి`ఫామ్‌ అందుకున్నారు. కోటిరెడ్డికి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి బీ`ఫామ్‌ను అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డి, నల్లగొండ, సూర్యపేట, భువనగిరి యాదాద్రి జిల్లాల ప్రజాపరిషత్‌ చైర్మన్‌లు బండా నరేందర్‌ రెడ్డి, గుజ్జ దీపికా యుగంధర్‌ రావు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, శాసనమండలి సభ్యులు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు, శాసనసభ్యులు గాదరి కిశోర్‌ కుమార్‌, చిరుమర్తి లింగయ్య, రవీంద్ర నాయక్‌, కంచర్ల భూపాల్‌ రెడ్డి, యన్‌.భాస్కర్‌ రావు, నోముల భగత్‌, ్గªళ్లై శేఖర్‌ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.