.ఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ

share on facebook

రుద్రంగి సెప్టెంబర్ 23 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో శుక్రవారం టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ..శాసనసభ్యులు డా.చెన్నమనేని రమేష్ బాబు సహకారంతో..రుద్రంగి మండలంలోని లబ్ధిదారులకు వచ్చిన 4,45,000 రూపాయల విలువైన చెక్కులను రుద్రంగిలోని ఆయా లబ్ధిదారులకు వారి ఇంటి వద్ద అందించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఎమ్మెల్యే రమేష్ బాబు దత్తత గ్రామమైన రుద్రంగి ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నారని, టీఆరెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్నివర్గాలను సామాజికంగా,ఆర్థికంగా గౌరవ ప్రదంగా అభివృద్ధి చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే అని, ప్రతిపక్షాలకు ఇక్కడ మనుగడ లేదని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పిటిసి గట్ల మీనయ్య, టిఆర్ఎస్ నాయకులు దేగవత్ తిరుపతి, టిఆర్ఎస్ నాయకులు శ్యాంసుందర్,తలారి నరసయ్య, కొమీరే శంకర్,కంటే రెడ్డి, కాదాసు లక్ష్మణ్, దాసరి గంగరాజం,ఆకుల గంగారం, దయ్యాల నారాయణ,కేసిరెడ్డి నర్సారెడ్డి, చెప్పాల గణేష్,గొల్లం నర్సింగ్, దయ్యాల పెద్దలు,దుబ్బ రవి తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.