ఎఎన్‌ఎంల జీతాల పెంపు హర్షణీయం

share on facebook

ఉషాదయాకర్‌ రావు

జనగామ,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రజానికం ఆరోగ్యవంతమైన జీవితం గడపాలన్న లక్ష్యంతో.. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అవగాహన కల్పిస్తున్న ఆశా వర్కర్లకు వేతనాలు పెంచిన మహానీయుడు సియం కేసిఆర్‌ అని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు సతీమణి, ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్టు చైర్‌ పర్సన్‌ ఉషాదయాకర్‌ రావు అన్నారు. దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఆశా వర్కర్లు, ఏ యన్‌ యంల సమావేశానికి ఉషాదయాకర్‌ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి సంక్షేమ పథకంపై క్షేత్రస్థాయిలో అవగాహాన కల్పించినప్పుడే.. ఆ పథకాల ఉద్దేశం నేరవేరుతాయని, క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన కల్పించేందుకు కృషిచేయాలని కోరారు. ఆశా వర్కర్లు, ఏ యన్‌ యంల సేవలు గుర్తించి వేతనాలు పెంచినందుకు సియం కేసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఉషాదయాకర్‌ రావును సన్మాణించి, స్వీట్లు పంచారు.

 

Other News

Comments are closed.