ఎనుమాముల మార్కెట్‌లో ఇవిఎంలు భద్రం

share on facebook

గట్టి పోలీస్‌ పహారా ఏర్పాటు
వరంగల్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇవిఎంలును సురక్షితం చేశారు.  పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశిరచే ఈవీఎంలు శుక్రవారం అర్ధరాత్రి వరకు ఎనుమాముల మార్కెట్లోని స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరాయి. వరంగల్‌ తూర్పు, పశ్చిమతో పాటు వివిధ నియోజకవర్గాల ఈవీఎంలను పోలింగ్‌ కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది భారీ భద్రత మధ్య తీసుకువచ్చి అధికారులకు అప్పగించారు. రాత్రి పొద్దుపోయే వరకు ఈ పక్రియ కొనసాగింది. మార్కెట్‌కు చేరుకున్న ఈవీఎంలను రిటర్నింగ్‌ అధికారుల సమక్షంలో పరిశీలించి మార్కెట్లోని స్టాం/-రగ్‌రూంలో భద్రపరిచారు. కేంద్ర బలగాల పహారాలో ఈవీఎంలను స్టాం/-రగ్‌ రూమ్‌లకు చేర్చారు. ఈనెల 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎనుమాముల మార్కెట్‌కు వివిధ నియోజకవర్గాల నుంచి ఈవీఎంలను తరలించారు.  ఈ నెల 11వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని టీటీడీపీ నేత, పశ్చిమ అభ్యర్థి రవూరి ప్రకాశ్‌ రెడ్డి అన్నారు.  నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని, సంక్షేమ, అభివృద్ధి పథకాలు పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. 2014 సాధారణ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హావిూని తెరాస ప్రభుత్వం అమలు చేయకపోగా, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్ధి సింగపురం ఇందిరకు గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Other News

Comments are closed.