ఎన్నికల్లో గెలుపు టిఆర్‌ఎస్‌దే: మహేందర్‌ రెడ్డి

share on facebook

రంగారెడ్డి,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్‌ఎస్‌దే గెలుపు అని మంత్రి మహేందర్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్‌ నార్సింగ్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధిగా మంత్రి మహేందర్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అసెంబ్లీ రద్దు నిర్ణయం పూర్తిగా కేసీఆర్‌ చేతుల్లో ఉందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌ పార్టీదే గెలుపు అన్నారు. రంగారెడ్డి జిల్లాలో టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడం ఖాయం అన్నారు. కాగా, మంత్రి మహేందర్‌ రెడ్డితో పాటు ఎమ్మెల్యే ప్రకాశ్‌ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి, ఎమ్మెల్యే సమక్షంలో మార్కెట్‌ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

Other News

Comments are closed.