ఎన్నికల ప్రచారంలో రఘునందన్‌ రావు

share on facebook

 

 

 

 

సిద్దిపేట,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): దుబ్బాకలో ఈ ఎన్నికల్లో పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్‌ రావు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఇప్పటి నుంచే ప్రత్యక్ష ప్రచారంలో దిగారు. ఈ మేరకు కేంద్ర ప్రథకాలు తెలియచేస్తూ ప్రచారం చేపట్టారు. సిద్దిపేట, గజ్వేల్‌, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి దుబ్బాకలో జరగడం లేదని రఘునందన్‌రావు పేర్కొన్నారు. దుబ్బాక మండలంలోని వివిధ గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, ఎన్నికల్లో భాజపాను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అవినీతిరహిత సమాజం భాజపాతోనే సాధ్యపడుతుందని, అందుకే బిజెపికి అవకాశం ఇవ్వాలని కోరారు.

Other News

Comments are closed.