ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు మింగుడు పడడం లేదు

share on facebook

నిజామాబాద్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి):గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్టాల్ల్రో భాజపా విజయం కాంగ్రెస్‌ పార్టీకి చెంపపెట్టులాంటిందని భాజపా జిల్లా  అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి  అన్నారు.అయినా కాంగ్రెస్‌ తన బింకాన్ని వదులులకోకుండా విపరీత వ్యాఖ్యానాలు చేస్తోందని మండిపడ్డారు. గుజరాత్‌ ఫలితాలు రాహుల్‌కు మింగుడు పడడం లేదన్నారు. కుట్రపూరిత ప్రచారాల వల్లనే అక్కడ సీట్లు తగ్గాయని రాహుల్‌ గుర్తుంచుకోవాలని అన్నారు.  కుటుంబ పాలనను ప్రజలు అంగీకరించడం లేదన్న  విషయాన్ని ఈ రెండు రాష్టాల్ర ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. దశాబ్దాలుగా దేశాన్ని దోచుకుతింటున్న కాంగ్రెస్‌ నాయకులకు ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయాలు రుచించడంలేదన్నారు. దేశంలోని నల్లకుబేరులంతా కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నారని, ఆ డబ్బును వెలికితీయడానికి నరేంద్రమోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దుకు అడుగడుగునా కాంగ్రెస్‌ నాయకులు అడ్డుతగులుతున్నారని  ఆరోపించారు.  ఎన్నికల ప్రచారంలో రాజకీయ దిగజారుడుతనంతోనే ప్రధాని నరేంద్రమోదీని అవహేళన చేసేలా, వ్యక్తిగతంగా కాంగ్రెస్‌ నాయకులు విమర్శించారని, చివరికి ప్రజలు ఆ పార్టీ నేతలకు తగిన గుణపాఠం చెప్పారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా భాజపా విజయఢంకా మోగించడం ఖాయమని, కాంగ్రెస్‌ పార్టీకి ధరావతు గల్లంతవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కూడా బిజెపి విజయం సాధిస్తుందన్నారు.

Other News

Comments are closed.