ఎన్నికల హామీలు నెరవేర్చలేకనే ముందస్తు డ్రామా

share on facebook
నల్గొండ: అసెంబ్లీ రద్దు అర్థరహితమని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి అన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చలేకనే కేసీఆర్‌ ముందస్తు డ్రామా ఆడుతున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. నన్ను మాజీని చేసిన ప్రభుత్వమే రద్దు కావడం సంతోషంగా ఉందని కోమటిరెడ్డి తెలిపారు. గతంలో మా నేతలు టికెట్ల విషయంలో కుట్ర రాజకీయాలు చేశారని ఆరోపించారు. గత ఎన్నికల్లో కొన్ని తప్పిదాల వల్లనే అధికారం కోల్పోయామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ విజయం కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ఏబీఎన్‌తో కోమటిరెడ్డి వెల్లడించారు. అభ్యర్థుల జాబితాతో కేసీఆర్ సెల్ఫ్ గోల్, రాజకీయాల్లో హత్యలు ఉండవు…ఆత్మహత్యలే, అందుకు సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితానే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ విజయాన్ని ఎవరు ఆపలేరని, టీఆర్‌ఎస్‌లో సగానికిపైగా అభ్యర్థులకు డిపాజిట్ రాదని ఏబీఎన్‌తో కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేస్తే 100 సీట్లు గెలుస్తామని.. గెలిచే అభ్యర్థుల టికెట్ల కోసం పార్టీలో కొట్లాడుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

Other News

Comments are closed.