ఎమ్మెల్యే మాణిక్ రావు ను కలిసిన ఫీల్డ్ అసిస్టెంట్లు

share on facebook

జహీరాబాద్ ఆగస్టు 12( జనంసాక్షి )
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు జాయిన్ కావడం జరిగిందని దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం జహీరాబాద్ లోని ఎమ్మేల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మాణిక్ రావు ను కలిసి స్వీట్లు పంచుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై తొమ్మిది నెలల నుండి విధుల నుండి పక్కన పెట్టిన ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్ట్యా గత మూడు నెలల క్రితం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి వీధిలో తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మొగుడం పల్లి, మండలాల ,ఫీల్డ్ అసిస్టెంట్లు తజొద్దిన్, ఇమామ్,నవీన్ తేజ, హేమలత, బుజ్జమ్మ, అనంత్ రామ్,మోహన్, మొగులయ్యా, విజయ్ కుమార్, తుక్కారామ్ గోపాల్, తదితరులు పాల్గొన్నారు

Other News

Comments are closed.