ఎయిడ్స్‌ నివారణపై వ్యాసరచన పోటీలు

share on facebook

 

యాదాద్రిభువనగిరి, నవంబర్‌30(జ‌నంసాక్షి): ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం పురస్కరించుకుని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డిసెంబర్‌ 1న మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు కృషి ఐటీఐ క్యాంపస్‌లోని సాయికృప డిగ్రీ, పీజీ కళాశాల ఆవరణలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘ఎయిడ్స్‌ నివారణ-సామాజిక బాధ్యత’ అంశంపై పోటీ ఉంటుందని కళాశాలల విద్యార్థులు, యువతీ యువకులు పాల్గొనొచ్చని తెలిపారు.

 

 

Other News

Comments are closed.