ఎల్ది మల్లయ్య

share on facebook

టీడీపీ మండల కన్వీనర్‌గా ‘ఎల్ది’

మహబూబాబాద్‌, నవంబర్‌ 18(జనంసాక్షి):

టీడీపీ మండల కన్వీనర్‌గా పట్టణానికి చెందిన ఎల్ది మల్లయ్య ఎన్నికయ్యారు. మండలంలోని అమనగల్‌ గ్రామానికి చెందిన ఎల్ది మల్లయ్య 1988లో టీడీపీలో చేరి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పదవులు నిర్వర్తించారు. 2006లో గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం 10 సంవత్సరాలు జర్నలిస్టు వృత్తిలో కొనసాగి తిరిగి టీడీపీ పార్టీలో చేరి చురుగ్గా పనిచేస్తున్నారు. కాగా పార్టీ జిల్లా అధ్యక్షులు కొండపల్లి రాంచందర్‌రావు నియామక పత్రాన్ని మల్లయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ ఎన్నిక చేసిన కొండపల్లి రాంచందర్‌రావు, ఇంచార్జ్‌ భూక్య సునిత, దారావత్‌ వెంకటేశ్‌, గద్దల కృష్ణయ్య, వివిధ గ్రామాల మండల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

Other News

Comments are closed.