ఎసిబి వలలో విఆర్వో

share on facebook

ఖమ్మం,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): మరో లంచగొండి అధికారి ఎసిబికి చిక్కాడు. ఖమ్మం జిల్లాకు చెందిన కలకోడ గ్రామ వీఆర్వో శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కారు. పట్టా పాసుపుస్తకం కోసం రూ. ఐదు వేల లంచం డిమాండ్‌ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. వలపన్నిన అవినీతి నిరోధక శాఖ అధికారులు బాధితుడి నుంచి వీఆర్వో లంచం తీసుకుంటుండగా పట్టుకుని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Other News

Comments are closed.