ఏడాదయినా సామాన్యులకు తప్పనితిప్పలు 

share on facebook

నోట్ల రద్దు జరిగి నేటితో ఏడాది పూర్తయ్యింది. నల్లధనంపై యుద్దమంటూ ప్రధాని మోడీ పెద్దనోట్లను రద్దుచేశారు. ఏడాది కాలంగా ఏం జరిగిందన్న విశ్లేషణ చేయకపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. సామాన్య,మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా దెబ్బతిన్నారు. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ప్రజలకు నగదు చలామణి చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థ సామాన్యలకుచేరువ చేస్తామని చేసిన ప్రకటనలు బూటకంగా మారాయి. బ్యాంకుల తీరు కాబూలీ వాలాలను మించి పోయాయి. ఎటిఎంలు దిష్టిబొమ్మల్లా మారాయి. వందరూపాయాలు డ్రా చేసుకున్నా కనీసంగా 23 రూపాయల స్వీస్‌ ఛార్జి వతూలు చేస్తున్నారు. ఇదెక్కడి సంస్కరణమో ప్రధాని చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతుంటే గత ఏడాది కాలంగా ఇవే సమస్యలు కొనసాగుతున్నాయి. ఈ సమస్యలపై ప్రధాని సవిూక్షించలేకపోవడం వల్ల వాటి తీవ్రతను అర్థం చేసుకోవడం లేదు. కేవలం కొందరు నల్లడబ్బు దాచుకున్నారన్న వ్యూహంలో ఈ నిర్ణయం తీసుకున్నా, అమలులో ఇది సత్ఫలితం ఇవ్వలేదనే చెప్పాలి. యుద్దం చేస్తే తదనంతర పరిణామాలను ఎదుర్కొనే ధీటైన వ్యూహం ఉండాలి. అలాంటి సవాళ్లకు తక్షణ జవాబు సిద్దంగా ఉంచుకున్న తరవాతనే అందుకు ప్రయత్నాలు చేసి ప్రత్యామ్నాయాలు సిద్దంగా ఉంచుకోవాలి. కానీ నోట్ల రద్దు కారణంగా ఏర్పడే దుష్ఫలితాలను ప్రధాని పట్టించుకోలేదు. నోట్లరద్దుతో ఎందరో క్యూలైన్లలో నిలబడి చనిపోయినా వారికి పరిహారం ఇవ్వలేదు సరికాదా కనీసం విచారం కూడా వ్యక్తం చేయకపోవడం దారుణం కాక మరోటి కాదు. ఏడాదిగా గ్రామాల్లో ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. బ్యాంకులకు ప్రజలు చేరువవుతారన్న ప్రకటనలు బూటకమని తేలిపోయింది. చక్రవడ్డీని మించి బ్యాంకులు అయినదానికి కానిదానికి వసూలు చేస్తున్‌ఆనయి. ఇలాంటి వాటిని సమస్యగా చూడడంలో బిజెపి ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యింది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగి, ధరలు ఆకాశన్ని అంటుతున్న వేళ పెద్దనోట్ల రద్దు జరిగి ఏడాదైనా సామాన్యలకు కష్టాలు తీరలేదు. అలాగే ధరలు స్వారీ చేస్తున్నాయి. ఉల్లిగడ్డల ధరలు మళ్లీ 40కి చేరువలో ఉన్నాయి. ఉప్పులు పప్పుల ధరలు సామాన్యుడి దరికి రావడం లేదు. కాయకష్టం చేసుకుని దాచుకున్న సొమ్ముకు లెక్కలు అడిగితే సామాన్యుడి దగ్గర సమాధానం ఉండదు. అడుక్కునే వారిదగ్గరా డబ్బు ఉంటుంది. పాచిపని చేసుకునే వారిదగ్గరా ఉంటుంది. వీటిని మార్చు కోవడానికి సవాలక్ష నిబంధనలు పెట్టి ఇప్పుడు జన్‌ధన్‌ ఖాతాలను కూడా జల్లెడ పట్టడం ద్వారా సామాన్యలకు చుక్కలు చూపారు. అందుకే సామాన్యుడిలో అసహనం ఉంటుంది.సామాన్యులు, మధ్య తరగతి జీవులు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో, బాధలు పడుఉతన్నారో గమనించడంలో మన చాయ్‌వాలా గుర్తించడం లేదు. నల్లధనాన్ని వెలికి తీయడానికి నోట్ల రద్ద వ్యవహారం బెడిసి కొట్టిందనే చెప్పాలి. పారదర్శక బ్యాంకింగ్‌ వ్యవస్థ లేకుండా పోయింది. లావాదేవీల పన్నులు విధానం అమల్లోకి తీసుకుని వస్తామని చెప్పినా అమలు కాలేదు. ఆదాయపన్నుల చెల్లింపును సరళీకరించి ప్రతి ఒక్కరూ ఎంతోకొంత పన్ను చెల్లించే విధానం అమల్లోకి తీసుకుని రావాలి. నగదురహిత విధానాలు అమలు చేయాలంటే అందుకు తగి ఏర్పాట్లు ఉండాలి. కానీ నగదు రహిత లావాదేవీలు కూడా భారంగా మారాయి. రూ. 500 రూ. 1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేయడం దేశవ్యాప్తంగా సంచలనానికి దారి తీసిందే తప్ప సమస్యలను పరిష్కరించలేక పోయిందన్నది వాస్తవం. సామాన్యులకు ఇబ్బందిగా ఉన్న వేళ వందల కోట్లు నల్లధనం వెనకేసుకున్న కోట్లాదమంది అక్రమార్కులకు ఈ నిర్ణయం శరాఘాతం లాంటిదని మోడీ చెబుతున్నా నల్లధనం ఉన్నవారు ఇబ్బందులు పడ్డట్లుగా సమాచారం లేదు. ప్రభుత్వ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న నల్లధనం బయటకు వస్తుందన్న అంచనాలు తలకిందులు అయ్యాయి. పేద,మధ్య తరగతి ప్రజలకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయని,రద్దు నిర్ణయం మేలు చేస్తుందని అంటున్న ప్రధాని అవి ఎలాగో వివరించలేకపోయారు. ప్రధానంగా వేలకోట్లకు సంబంధించిన వ్యవహారాలైనా బ్యాంకుల లావాదేవీల ద్వారా జరిగేలా చూడాలి. బ్లాక్‌మనీ కలిగిన వారు లెక్కకు మించి ఖర్చు చేయకుండా నిబంధనలు అమల్లోకి వస్తే ధరల పెరుగుదలను కూడా అరికట్టవచ్చు. ¬టళ్లు, టూరిజం, ప్రయాణాలు లగ్జరీ కింద మార్చడంతో సామాన్యులకు అవకాశాలు లేకుండా పోయాయి. డబ్బున్న వారు ఏదైనా ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తుంటారు. దీంతో సామాన్యులకు ఏదీకూడా ఏడాదిగా అందని ద్రాక్షగా మిగిలి పోయింది. అనధికారిక లావాదేవీల స్థానంలో అధికారిక లావాదేవీలు గణనీయంగా పెరుగుతాయని చెప్పినా బ్యాంకుల తీరు కారణంగా అది కూడా విఫల ప్రయోగంగానే మారింది. పారదర్శకత అధికం అవుతుందని, ప్రభుత్వ ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేసిన దరిమిలా ఆదాయపన్ను రిటర్న్‌లు మాత్రం పెరిగాయి. ఇప్పటి వరకూ నల్లధనం చెలామణికి వీలు కల్పిస్తున్నాయని భావిస్తున్న రియల్‌ ఎస్టేట్‌, సినిమా,ఆభరణాల వ్యాపారంలోనూ ఎలాంటి మార్పులు కనిపించకపోగా ధరలు అమాంతంగా పెరిగాయి. ఆయా రంగాల్లో నల్లధనం తగ్గుముఖం పట్టినట్లు అవుతుందని ప్రకటించినా అలాంటి ఆధారాలు లేవు. పెద్దనోట్ల రద్దు మంచిపని అని చెబుతున్న ప్రధాని మోడీ దాని ఫలాలు ప్రజలకు అందడం లేదని గుర్తించాలి. దీనిపై సవిూక్ష చేయాలి. గ్రామస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అప్పుడే అశించిన ప్రయోజనాలు కలుగుతాయి. ఏడాది కాలంగా ప్రభుత్వానికి ఆదాయం పెరిగి ఉండవచ్చు గాక…కానీ సామాన్యులకు శతకోటి సమస్యలను మాత్రం సృష్టించారని గుర్తించాలి.

Other News

Comments are closed.