ఏపీ కాంగ్రెస్ నేతలపై వీహెచ్ అసహనం

share on facebook

కాకినాడ: హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం పునర్ నిర్మాణం జరిగే వరకు తన పోరాటం ఆగదని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు హెచ్చరించారు. కాకినాడలో ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఒంటరిగా నిరసన దీక్ష చేశారు. దీక్షపై ముందుగానే ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో మాట్లాడానని, ఆయన దీక్ష చేయమన్నారని చెప్పారు. అయితే తనకు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ నేతలు సహకరించలేదని, ఇది తనకు జరిగిన అవమానం కాదని, అంబేద్కర్‌కు అవమానం జరిగినట్టు భావిస్తున్నానని వీహెచ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

Other News

Comments are closed.