ఏసీబీ వలలో అవినీతి చేప

share on facebook

– లంచంతీసుకుంటూ పట్టుబడ్డ కొత్తకోట తహశీల్దార్‌
వనపర్తి, జులై11(జ‌నం సాక్షి) : కొత్తకోట తహశీల్దార్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. మండల కేంద్రానికి సవిూపంలోని కనిమెట్ట వద్ద ఉన్న ఓ ¬టల్‌లో హైదరాబాద్‌కు చెందిన రియాల్టర్‌ వద్ద రూ. 1.50 లక్షలను తహశీల్దార్‌ మల్లికార్జున్‌ రావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం మల్లికార్జున్‌ రావును ¬టల్‌ నుంచి తహశీల్దార్‌ కార్యాలయానికి తీసుకువచ్చారు. మల్లికార్జున్‌ రావును విచారించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఓ భూ వివాదం పరిష్కరించేందుకు రూ. 5 లక్షలు, ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌ను లంచంగా తహసీల్దార్‌ డిమాండ్‌ చేశాడు. దీంతో బాధిత రియాల్టర్‌ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. పక్కా పథకం ప్రకారం ఏసీబీ అధికారులు నిఘా ఉంచి తహసీల్దార్‌ను రెడ్‌ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. కాగా తహసీల్దార్‌ గతంలోనూ పలువురి నుండి భూ వివాదాలను అడ్డుపెట్టుకొని డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు.

Other News

Comments are closed.