ఓటు నమోదుకు అంతా కదలాలి: ప్రధాని మోడీ

share on facebook

న్యూఢిల్లీ,జనవరి25(జ‌నంసాక్షి): ఓటు హక్కు పొందేందుకు అర్హులైనవారందరూ స్వయంగా ఓటర్లుగా

నమోదు చేయించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారత దేశ ప్రజాస్వామ్యం బలోపేతమయ్యేందుకు ఇది దోహదపడుతుందన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆయన ఈ సందేశం ఇచ్చారు. ఎన్నికల కమిషన్‌ వార్షికోత్సవం సందర్భంగా ఎన్నికల సంఘాన్ని అభినందించారు.

ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, వారి భాగస్వామ్యంతో మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని అర్హులైన ఓటర్లందరికీ, ముఖ్యంగా యువతకు, విజ్ఞప్తి చేస్తున్నాను. ఓటు శక్తి మహత్తరమైనది’ అని మోదీ ట్వీట్‌ చేశారు. 1950 జనవరి 25న ఎన్నికల కమిషన్‌ ఏర్పాటైంది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

Other News

Comments are closed.