ఓడిశాలో ఘోర రోడ్డు పమాదం

share on facebook

– బైక్‌ను ఢీకొన్న కారు ఆరుగురు మృతి
భువనేశ్వర్‌, అక్టోబర్‌20(జ‌నంసాక్షి) : ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ సవిూపంలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. భువనేశ్వర్‌ శివార్లలోని ఉత్తరాచౌక్‌ వద్ద కారు-ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. రాత్రి 10 గంటల సమయంలో ఉత్తారా చౌక్‌ వద్ద ఎదురుగా వస్తోన్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు అనంతరం సవిూపంలోని కాల్వలోకి దూసుకుపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తోన్న నలుగురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బైక్‌పై ఉన్న ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడి మృతి చెందారు. భార్యభర్తలు ద్విచక్రవాహనంపై భువనేశ్వర్‌కు వస్తుండగా, కారులో ప్రయాణిస్తోన్న వారు పూరీకి వెళ్తున్నట్టు తెలిపారు. ఓ వ్యక్తి కారు నడుపుతుండగా, అందులో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్టు తెలియజేశారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పిప్లీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, అప్పటికే వారు ప్రాణాలు కోల్పోవడంతో మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులు వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొంటున్నారు. వేగంగా కారునడుపుతూ ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనాన్ని గుర్తించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.

Other News

Comments are closed.