ఓడీఎఫ్‌ గ్రామాల సర్పంచ్‌లకు 19న సన్మానం

share on facebook

జనగామ,నవంబర్‌8(జ‌నంసాక్షి): ప్రజల భాగస్వామ్యంతోనే ఓడీఎఫ్‌ గ్రామాలు సాధ్యమవుతాయని డ్వామా పీడీ అన్నారు. గ్రామల్లో స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా నిర్మించనున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. వందశాతం పూర్తి చేసేందుకు సహకరించిన సర్పంచ్‌లను నవంబర్‌ 19న జిల్లా కేంద్రంలో వారిని సన్మానించనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 30,924 మరుగుదొడ్లు నిర్మాణానికి మంజూరు ఇచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేసేందుకు మండలాల వారిగా కలెక్టర్‌ ఇన్‌చార్జిలను నియమించారని తెలిపారు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నవంబర్‌ 19న ప్రపంచ టాయిలెట్స్‌ దినోత్సవం వరకు జిల్లా వ్యాప్తంగా 210 గ్రామాలలో 59 గ్రామాలను 100శాతం ఓడీఎఫ్‌ గ్రామలుగా చేయనున్నట్లు తెలిపారు. దానిలో భాగంగా స్టేషన్‌ఘన్‌పూరు మండలంలోని విూదికొండ, రాఘవపూర్‌, కొత్తపల్లి గ్రామాలను గుర్తించామని, చిలుపూరు మండలంలో వంగాలపల్లి, దేశాయితండ గ్రామాలు ఉన్నాయని తెలిపారు. గ్రామాల వారీగా వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారిని గుర్తించి ప్రభుత్వం పథకాలను, రేషన్‌సరుకులను, పింఛన్‌ను నిలిపివేయనున్నట్లు చెప్పారు.

Other News

Comments are closed.