కందుల కొనుగోళ్లకు ఆటంకాలు లేవు

share on facebook

రైతులు ఆందోళనకు గురికావద్దు

ఆదిలాబాద్‌,జనవరి 7 (జ‌నంసాక్షి): కందుల కొనుగోళ్లకు ఎలాంటి ఆటంకాలు లేవని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆరె రాజన్న వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో కందుల కొనుగోళ్లు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తెలిపారు. మార్కెట్‌ యార్డులో కందుల కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధధకు కొనుగోలు చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా వీటిని కొనుగోలు చేయనుందన్నారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు మధ్యాహ్న భోజనం కోసం సద్దిమూట పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇస్కాన్‌ ఆధ్వర్యంలో ఈ పథకం నిర్వహిస్తుందన్నారు. రైతులకు రూ.5కే భోజనం అందజేయనునట్లు తెలిపారు. కంది పప్పు ధర అమాంతంగా పెరిగిపోవడంతో ధరల నియంత్రణకు గతేడాది వాణిజ్యపరంగా ఎఫ్‌సీఐ కొనుగోలు చేసింది. అయితే పంట చేతికి వచ్చేసరికి మద్దతు ధర కూడా లభించని పరిస్థితి నెలకొంది. కందికి గతంలో ఎప్పుడూ లేనంతగా ధర ఉండటంతో గతంకంటే 25 వేల హెక్టార్లలో అదనంగా సాగు చేశారు. సాధారణ సాగుతో పోలిస్తే ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో రెట్టింపు సాగు అయింది. ఏడాది ఆదిలాబాద్‌ జిల్లాలోనే 28 వేల హెక్టార్లలో సాగు కాగా 25 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ధర పెరుగుతుందని భావించిన వ్యాపారులు కందిని నిల్వ చేసుకున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతుల పేరున వ్యాపారులు పంటను అమ్మే అవకాశం ఉందని కిసాన్‌సంఘ్‌ నాయకులుఅన్నారు. రైతుల నుంచి మాత్రమే కంది ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన కోరారు.

Other News

Comments are closed.