కథువా కేసుతో హిందువులపై అప్రతిష్టకు కుట్ర

share on facebook

కేంద్రమంత్రి ఘాటు వ్యాఖ్య
పాట్నా,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి):  కాశ్మీర్‌లోని కథువా రేప్‌ కేసు ద్వారా హిందువులను అప్రదిష్టపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని కేంద్రమంత్రి, బీజేపీ నేత గిరిరాజ్‌ సింగ్‌ ఆరోపించారు.ఈ ఘటనలో దోషులు ఎవరైనా ఉపేక్షించబోమని అన్నారు. అయితే కావాలనే హిందువులను టార్గెట్‌ చేస్తున్నారని
గిరిరాజ్‌ అన్నారు.  తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే  గిరిరాజ్‌ ఇలి మరోసారి నోటికి పనిచెప్పారు.  రాజకీయ గేమ్‌ ఎపలాన్‌లో భాగంగానే ఈ కేసుపై రాద్దాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని కఠువా జిల్లాలో ఇటీవల కొందరు మానవ మృగాలు ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి తెగబడి, చంపేసి సవిూప అడవుల్లో పడేశారు. ఈ దారుణంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు
వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు సైతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. ఈ నేపథ్యంలో  బీహార్‌లోని తన సొంత నియోజక వర్గమైన నవాడాలో కేంద్రమంత్రి గిరిరాజ్‌ మాట్లాడుతూ…కఠువా కేసుతో హిందువుల ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర జరిగింది. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు దేశాన్ని విడగొట్టేందుకు కుట్రపన్నారు. సెక్యులరిజం పేరట కొందరు హిందువులకు చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు స్వామి అసీమానందపై హిందూ టెర్రర్‌ ముద్ర వేసేందుకు ప్రయత్నం చేశారనీ… ఇప్పుడు కథువా కేసు పేరిట హిందువులను కించపర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా కథువా సామూహిక అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాననీ… నిందితులను తక్షణమే అరెస్టు చేయాలంటూ డిమాండ్‌ చేశారు. దోషులు ఎవరైనా మతాలతో సంబంధం లేదన్నారు.

Other News

Comments are closed.