కరోనాకు మరో ఎమ్మెల్యే బలి

share on facebook

టిఎంసి ఎమ్మెల్యే తమోనాష్‌ ఘోష్‌ మరణం
కోల్‌కతా,జూన్‌24(జ‌నంసాక్షి ): కరోనావైరస్‌ బారిన పడి మరో ఎమ్మెల్యే మృతి చెందాడు. తన పుట్టినరోజు నాడే ప్రాణాు కోల్పోయిన తమిళనాడు ఎమ్మెల్యే జె. అన్జాగగన్‌ ఘటన మరువక ముందే.. మరో ఎమ్మెల్యే కరోనాబారినపడి మృతిచెందారు..కరోనా పాజిటివ్‌గా తేలిన టీఎంసీ ఎమ్మెల్యే తమోనాష్‌ ఘోష్‌ బుధవారం కన్నుమూశారు.. మే నెలో నిర్వహించిన కోవిడ్‌ `19 పరీక్షల్లో 60 ఏళ్ల టీఎంసీ ఎమ్మెల్యే తమోనాష్‌ ఘోష్‌కు పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం మృతి చెందినట్టు తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రకటించింది. ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు తమోనాష్‌.. కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు గుండె మరియు మూత్రపిండాకు సంబంధించిన అనేక సమస్యు ఉన్నట్టు చెబుతున్నారు.. ఇక, తమోనాష్‌ ఘోష్‌ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.. ఫాల్టా నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి.. ప్రజ సమస్య పరిష్కారానికి ఆయన ఎంతో కృషి చేశారు.. ఆయన లేని లోటు పూడ్చలేనిదంటూ సంతాపం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ… తమోనాష్‌ ఘోష్‌ కుటుంబసభ్యుకు సానుభూతి తెలిపారు.

Other News

Comments are closed.