కర్నాటక ఉప ఫలితాలు బిజెపికి చెంపదెబ్బ

share on facebook

అహంకారంపై ప్రజల ఆగ్రహానికి నిదర్శనం

ఆ పార్టీని ప్రజలు నమ్మడం లేదని రుజువయ్యింది

పార్టీ సమావేశంలో బాబు వ్యాఖ్య

అమరావతి,నవంబర్‌6(జ‌నంసాక్షి): రాజకీయ పార్టీలలో బీజేపీ చిచ్చు పెడుతోందని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కర్నాటక ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి చెంపపెట్టని అన్నారు. అలాగే ప్రజలు ఆ పార్టీని దూరం పెడుతున్నారని, బిజెపి అహంకారానికి ఫలితాలు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

ప్రతిపక్ష నేతల కుటుంబాల్లో కూడా చిచ్చు రగిలిస్తోందన్నారు. కేసుల పేరుతో భయపెడుతున్నారని, డబ్బులతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ చేస్తున్న అరాచకాల వల్లే ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. వినాశకాలే విపరీత బుద్ధిలా బీజేపీ పోకడలు ఉన్నాయని విమర్శించారు. మంగళవారం టీడీపీ సమన్వయం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు. రాష్ట్రంలో రాజకీయ వ్యవహారాలపై పార్టీ నేతలు దిశానిర్దేశం చేశారు. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి శరాఘాతం అని, ప్రజల్లో బీజేపీపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం చంద్రబాబు పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణంగా దెబ్బతిన్నదని, బీజేపీకి చెందిన ఒక అభ్యర్థి పోటీ చేయకుండా తప్పుకుంటే.. పోటీ చేసిన అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారని అన్నారు. నరేంద్ర మోదీ పాలనపై ఉన్న వ్యతిరేకతకు ఈ ఫలితాలే సాక్ష్యం అని పేర్కొన్నారు. ప్రజలకు బీజేపీ ఎంత దూరం అయ్యిందో ఈ ఎన్నికలే స్పష్టమైన సంకేతం ఇస్తున్నాయని అన్నారు. గెలుపొందిన అభ్యర్థులకు లక్షల్లో మెజారిటీలు రావడం అంటే వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు, ఈ ఉప ఎన్నికలకు ఎంతో మార్పు ఉందన్నారు. రాజకీయం రోజు రోజుకూ మారిపోతోందని, అహంభావంతో ఉంటే ప్రజలే కళ్లు తెరిపిస్తారని మరోసారి రుజువైంద న్నారు. అహంభావం, అతి విశ్వాసం పతనానికి దారితీస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వచ్చే ఐదు శాసనసభ ఎన్నికల్లో వీటి ప్రభావం ఉంటుందన్నారు. బిజెపిని దేశంలో ప్రజలు విశ్వసించడం లేదన్నారు.

 

 

 

Other News

Comments are closed.