కల్వకుర్తిలో నామినేషన్‌ వేసిన ఆచారి

share on facebook

ఈ సారి గెలుపు తనదేనన్న భరోసా

నాగర్‌ కర్నూల్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): కల్వకుర్తిలో ఈసారి బీజేపీ జెండా ఎగరడం తథ్యమని ఆ పార్టీ అభ్యర్థి ఆచారి ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కేవలం 78 ఓట్లతో ఓడిపోయానని దానిని గుర్తించి ప్రజలు ఆశీర్వదించాలన్నారు. బిజెపి మాత్రమే స్థానిక సమస్యలను పరిష్కరించగలదన్నారు. గురువారం ఆయన బీజేపీ ముఖ్య నేతలతో కలిసి వెళ్లి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. అంతకుముందు ఆయన కార్యకర్తలతో ర్యాలీగా తరలివెళ్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆచారి విూడియాతో మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఎన్నికల్లో పోటీ చేస్తూ ఓడిపోతున్న తనను… ఈ ఎన్నికల్లో గెలిపించడానికి నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇంతకాలం తాను ఓడినా.. నియోజక వర్గం అభివృద్ధికి కృషి చేస్తునే ఉన్నానని ఆచారి పేర్కొన్నారు. గతంలో నాలుగు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశానని, 2014లో 78 ఓట్ల తేడాతో ఓడిపోయానని చెప్పారు. ఈ సారి కల్వకుర్తి ప్రజల ఆశీస్సులతో బీజేపీ జెండా ఎగురవేస్తానని ఆచారి ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Other News

Comments are closed.