కశ్మీర్‌పై ఐక్యరాజ్యసమితి నివేదిక

share on facebook

నివేదికలో వాస్తవం లేదన్న భారత్‌

న్యూఢిల్లీ, జూన్‌14(జ‌నం సాక్షి) : కశ్మీర్‌పై ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నివేదికను భారత్‌ తీవ్రంగా తప్పుపట్టింది. ఆ నివేదికలో వాస్తవం లేదని, అది వివాదాస్పదంగా ఉందని, తప్పుడు ధోరణిలో దాన్ని రాశారని భారత్‌ పేర్కొన్నది. భారత్‌లోని జమ్మూకశ్మీర్‌లో, పాకిస్థాన్‌లోని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని ఐక్యరాజ్యసమితికి చెందిన మానవ హక్కుల సంఘం నివేదిక వెల్లడించింది. ఆ సంఘం చీఫ్‌ జైద్‌ రాద్‌ అల్‌ హుస్సేన్‌ ఈ నివేదికను ఇచ్చారు. అయితే రెండు దేశాలు కొన్ని నియమాలను పాటించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా కశ్మీర్‌ ప్రజల ఆత్మాభిమానాన్ని గౌరవించాలంటూ ఆ రిపోర్ట్‌ భారత్‌ను కోరింది. అంతేకాదు 2016 జూలై నుంచి కశ్మీర్‌లో జరిగిన అల్లర్లపై దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. కవిూషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ వేయాలని కోరారు. కశ్మీర్‌ అంశంపై ఐక్యరాజ్యసమితిలో ఇలా మొదటిసారి నివేదికను సమర్పించారు. కశ్మీర్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి సమగ్రమైన దర్యాప్తు చేపట్టాలని జైద్‌ తన నివేదికలో డిమాండ్‌ చేశారు. సిరియా లాంటి సంక్షోభం ఉన్న దేశాల్లో మాత్రమే కవిూషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ వేస్తారు. అయితే కశ్మీర్‌ అంశంపై అలాంటి దర్యాప్తు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి కోరడం శోచనీయం. ఇటీవల పదేపదే భారత్‌, పాక్‌ సరిహద్దు దగ్గర కాల్పుల విమరణ ఉల్లంఘన జరుగుతున్న విషయం తెలిసిందే. హిజ్బుల్‌ ఉగ్రవాది బుర్హన్‌ వానీ హత్య తర్వాత రెండు దేశాల ప్రభుత్వాలతో తమ ప్రతినిధులు భేటీ అయినట్లు యూఎన్‌ తన రిపోర్ట్‌లో పేర్కొన్నది.

 

Other News

Comments are closed.