కాంగ్రెస్‌తోనే పేదల సంక్షేమం

share on facebook

తెలంగాణకు టిఆర్‌ఎస్‌ చేసిందేవిూ లేదు: డిసిసి

నిజామాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ ద్వారానే ప్రజలకు ములు జరుగుతుందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌బిన్‌ హుడాన్‌ అన్నారు. కెసిఆర్‌, టిఆర్‌ఎస్‌ హావిూలతో మోసపోవద్దన్నారు. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్‌ఇన పూర్తిగా నడపలేక చేతులెత్తేసిన వైఫల్య నేతలు వారని ఆయన విమర్శించారు. శనివారం

నాడిక్కడ మాట్లాడుతూ కెసిఆర్‌ నాలుగేళ్లలో అసమర్థ పాలకుడిగా మిగిలాడని దుయ్యబట్టారు. అందరూ కాంగ్రెస్‌ ద్వారా ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టిఆర్‌ఎస్‌పై పోరాడాలని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌బిన్‌ హుడాన్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ అనుసరిస్తున్న తీరుతో పోలీసు వర్గం తప్ప ఏ వర్గం సంతోషంగా లేరన్నారు. అంకితభావంతో పనిచేసి ఉమ్మడి జిల్లాలో పార్టీ గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్‌తోనే తెలంగాణ వచ్చిందని, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పోరాటం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఇటీవల పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరి ప్రభుత్వ విధానాలపై పోరాటం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిందేనని తెలిపారు. కాంగ్రెస్‌లోకి మరిన్ని వలసలు రావడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్‌ ఎంతో చేసిందని, ఆ పార్టీ పుణ్యంతోనే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు మారుతాయని పేర్కొన్నారు. తెలంగాణలో రాహుల్‌గాంధీ వచ్చినా తెరాసను ఏం చేయలేరని మంత్రి కేటీఆర్‌ మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన నెహ్రూ, గాంధీ కుటుంబంపైనా వ్యక్తిగత విమర్శలు చేస్తే కాంగ్రెస్‌ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.

 

 

Other News

Comments are closed.