కాంగ్రెస్‌లో మొదలైన ఎన్నికల వేడి

share on facebook

పరిశీలకుల పర్యటనలతో బలనిరూపణల్లో నేతలు

హైదరాబాద్‌,జూలై12(జ‌నం సాక్షి): ఎన్నికలు సవిూపిస్తున్న వేళ కాంగ్రెస్‌పార్టీ అగ్రనేతలు జిల్లా పర్యటనలకు వస్తుండడంతో ఆ పార్టీలో వేడి మొదలైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదేశం మేరకు ఏఐసీసీ స్థాయి నేతలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవల ఎఐసిసి కార్యదర్శి శ్రీనివాసన్‌ కృష్ణన్‌ ఇన్‌ఛార్జీ ¬దాలో ఆదిలాబాద్‌, కరీంనగర్‌లలో పర్యటించారు. పార్టీ పునర్నిర్మాణంకోసం అభిప్రాయాలుసేకరించేందుకు సన్నాహాలు మొదలు కావడంతో ప్రతి ఒక్కరూ తమ బలాబలాలను చాటుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎన్నికల గడువు ముంచుకొస్తుండడంతో పార్టీ టిక్కెట్టు తమకే ఇవ్వాలనే సందేశం ఇచ్చేలా తమ బలం ఉందని చూపడానికి ప్రయత్నించారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు ఉండడంతో ప్రతిచోటనుంచి నేతలు తరలివచ్చారు. ఇన్‌ఛార్జి ముందే కొందరు ఎదుటి వర్గంతో వాగ్వానికి దిగారు. ఆయనకు నేతలు స్వాగతం పలకడంలోనూ వర్గపోరు బహిర్గతమైంది.గ్రూపుల నాయకులు వేర్వేరుగా మూడుచోట్ల అనుచరులతో స్వాగతం పలికి తమ బలం నిరూపించుకోవడానికి పోటీపడ్డారు. మొదటినుంచి చివరకు అన్నీ పరిశీలించిన ఇంఛార్జి కృష్ణన్‌ చిన్న చిన్న తగాదాలుంటే కూర్చోని పరిష్కరించుకుందామని, ఇది ఎక్కడైనా సహజమేనేని ప్రతిఒక్కరు పార్టీకోసం పనిచేస్తే అధికారంలోకి వస్తామని హితబోధచేశారు. పార్టీ బలోపేతానికి ఏంచేయాలి? జిల్లాలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గట్టేందుకు ఉన్న అంశాలేమిటివి చర్చించాలన్నారు. అయితే అభ్యర్థుల పేర్లు ప్రస్తావించవద్దని కేవలం పార్టీ బలోపేతంకోసమే సూచనలు చేయాలని శ్రీనివాసన్‌ కృష్ణన్‌ స్పష్టం చేయడం అక్కడ ప్రాధాన్యాంశంగా మారింది. కార్యకర్తల అభీష్టం మేరకు అభ్యర్థిని ఎంపికచేస్తామని, పార్టీ సర్వేలు కూడా ఉంటాయని ఆయన వివరించారు. ప్రజల్లో ఉంటూ ప్రజావ్యతిరేక విధానాలపై ఇప్పటినుంచే పోరాటాలు ఉదృతం చేస్తేనే పార్టీ బలం పుంజుకుంటుందని సూచించారు. పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా చేయడం వలన కార్యకర్తలు అయోమయానికి గురవు తున్నారని పేర్కొన్నారు. నేతలు, కార్యకర్తల ద్వారా అభిప్రాయాలు సేకరించిన శ్రీనివాసన్‌ కృష్ణన్‌ రాబోయే రోజుల్లో నియోజక వర్గాల వారీగా స్వయంగా పర్యటించనున్నట్లు చెప్పారు. ప్రజల్లోకి వెళ్లి పనిచేసే నాయకులకు గుర్తింపు ఉంటుందని.. ప్రజలు చూపించిన అభ్యర్థులకే టిక్కెట్‌ ఇవ్వాలని నివేదిక తయారు చేసి రాహుల్‌కు పంపుతామనే సంకేతాలను ఇచ్చారు. వర్గాల కారణంగా పార్టీ బలహీనపడుతుందని.. వర్గాలు వీడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచనలు చేశారు. బాగా పనిచేసిన వాళ్లను గుర్తించి వాళ్లకే టిక్కెట్లు వచ్చేలా నివేదికలు తయారు చేయాల్సిందిగా పలువురు నేతలు తమ వాదనను వినిపించారు. నియోజక వర్గాల వారీగా క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్లు చెప్పడంతో స్థానిక నేతల్లోనూ పనిచేయాలనే ఆసక్తి పెరిగినట్లు కనిపించింది.

 

Other News

Comments are closed.