కాంగ్రెస్‌ ఓ దగాకోరు పార్టీ

share on facebook

– 60ఏళ్లుగా తెలంగాణకు కాంగ్రెస్‌ అన్యాయం చేస్తూనే ఉంది
– పోలవరానికి జాతీయ ¬దా ఇచ్చి.. ప్రాణహిత-చేవెళ్లకు మొండిచేయి చూపారు
– అన్ని రంగాల్లో అన్యాయానికి గురైన తెలంగాణ కాంగ్రెస్‌కు ఎందుకు గుర్తుకు రావటం లేదు?
– కాంగ్రెస్‌ నేతలు ఏ మొహం పెట్టుకుని యాత్రలు చేస్తారు
– కాంగ్రెస్‌ను ప్రశ్నించిన మంత్రి హరీష్‌రావు
సంగారెడ్డి,ఫిబ్రవరి26 (జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ ఓ దగాకోరు పార్టీ అని మంత్రి తన్నీరు హరీష్‌రావు
ఆరోపించారు. సంగారెడ్డి జిల్లాలో మంత్రి పర్యటించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌పై మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ దగాకోరు పార్టీ అని దుయ్యబట్టారు. 60ఏళ్లుగా తెలంగాణకు కాంగ్రెస్‌ అన్యాయం చేస్తూనే ఉందని హరీష్‌రావు మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక¬దాపై తొలి సంతకం చేస్తామనడం కాంగ్రెస్‌ దివాలాకోరుతనానికి నిదర్శనమని హరీశ్‌ మండిపడ్డారు. అన్నిరంగాల్లో అన్యాయానికి గురైన తెలంగాణ.. కాంగ్రెస్‌కు ఎందుకు గుర్తురావడంలేదని ప్రశ్నించారు. పోలవరానికి జాతీయ¬దా ఇచ్చి ప్రాణహిత-చేవెళ్లకు మొండిచేయి చూపారని ఆరోపించారు. ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్‌ నేతలు యాత్రలు చేస్తారని ఆయన అన్నారు. జైరాం వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేతలు సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా అని మంత్రి నిలదీశారు. తెలంగాణ పట్ల కాంగ్రెస్‌, బీజేపీ ఒకేరకంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. వెనుకబడిన తెలంగాణకు నిధులు, ప్రాజెక్టులు ఇవ్వకుండా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ప్రాధాన్యమివ్వడం దారుణమని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
మండలానికో గోదాం నిర్మిస్తాం
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రతీ మండలానికి మార్కెటింగ్‌ గోదాములు, సబ్‌యార్డులను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. రైతు సమన్వయ సమితుల అవగాహన సదస్సులో మినీ మార్కెట్ల ఏర్పాట్ల అంశంపై రైతుల నుంచి వచ్చిన అభిప్రాయాలపై మంత్రి స్పందించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు ఉండేవన్నారు. తెలంగాణ ఏర్పడినతర్వాత రూ.1000 కోట్లతో దేశంలో ఏ రాష్ట్రం లో జరుగనివిధంగా 18 లక్షల టన్నుల సామర్థ్యం కల్గిన గోదాముల నిర్మాణం పూర్తయిందని, మరో మూడు లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం 22లక్షల టన్నుల సామర్థ్యం కల్గిన గోదాములు రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. వీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని మంత్రి చెప్పారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పత్తి ఎక్కువగా పండిస్తున్నా అక్కడ జిన్నింగ్‌ మిల్లులు తక్కువగా ఉన్నాయన్నారు. వనపర్తిలో వేరుశనగ అధికంగా పండుతుందని, కానీ అక్కడ ఆయిల్‌ మిల్లులు లేవని చెప్పారు. స్థానికంగా ఏ పంట ఎక్కువగా పండితే దానికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని తెలిపారు. రైతు సమన్వ య సమితి సూచన మేరకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పుతామన్నారు. వ్యవసాయాధారిత ప్రాసెసింగ్‌ యూనిట్లు పెరిగితే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో కొత్తగా 35 మార్కెట్‌యార్డులను ఏర్పాటు చేసినట్లు
చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3500 మినీ మార్కెట్ల నిర్మాణానికి బ్జడెట్‌ కేటాయించిందని, దీనికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పన జరుగుతుంన్నదని తెలిపారు.

Other News

Comments are closed.