కాంగ్రెస్‌ కూటమి అంటే భయమెందుకో?: కటకం

share on facebook

కరీంనగర్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ కూటమి పేరు చెబితేనే అధికార టిఆర్‌ఎస్‌కు వణుకు పుడుతోందని కరీంనగర్‌ డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. కూటమిని తక్కువ చేసి చూపుతున్న వారు పదేపదే కాంగ్రెస్‌ గురించి ఎందుకు విమర్వలు చేస్తున్నారని అన్నారు. కూటమికి బలం లేదంటూనే ఒకవేళ అధికారంలోకి వస్తే అంటూ సన్నాయి నొక్కులు ఎందుకు నొక్కుతున్నారని అన్నారు.

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తెలంగాణ ఇచ్చాక అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లు గడిచినా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన శాతవాహన విశ్వవిద్యాలయానికి తెరాస ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లు గడుస్తున్నా ఉపకులపతిని నియమించకపోవడం సిగ్గుచేటన్నారు.

 

 

Other News

Comments are closed.