కాంగ్రెస్‌ గెలుపు ఖాయం: కోమటిరెడ్డి

share on facebook

యాదాద్రి,నవంబర్‌5(జ‌నంసాక్షి): నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు. రామన్నపేటలో రాజగోపాల్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ఒక్కస్థానంలో గెలిచినా రాజకీయ సన్యాసానికి సిద్ధమన్నారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తెలంగాణలో కాంగ్రెస్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. కూటమితో టిఆర్‌ఎస్‌లో వణుకు పుడుతోందన్నారు. అందుకే లేనిపోని ఆరోపణలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు.

 

 

Other News

Comments are closed.