కాంగ్రెస్‌ నేతలకు నిద్రపట్టడం లేదు: ఎమ్మెల్యే

share on facebook

వరంగల్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): దేశంలో నంబర్‌ వన్‌ రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తోందన్నారు. ఇవే తమకు శ్రీరామ రక్ష అన్నారు. ప్రగతినివేదన సభతో టిఆర్‌ఎస్‌ ఏ మేరకు ఎన్నెన్ని పనులు చేసిందీ కెసిఆర్‌ వివరించారని అన్నారు. ఇప్పుడు ఇక ఆశీర్వాద సభతో కాంగ్రెస్‌ ఇతర పార్టీలకు వణుకు పుట్టడం ఖాయమని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన అందరం సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎన్నికలు వస్తున్నాయంటే ఎన్నికలకు సంవత్సరం ముందు ప్రచారం మొదలు పెడుతున్నారని అన్నారు. బీజేపీ రైతులను మభ్యపెడుతోందన్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం కార్పొరేట్‌ స్థాయి విద్య అందించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 522 గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని వసతులు అందిస్తున్నామన్నారు. ప్రతి ఆదివారం కోడికూర, ప్రతిరోజు కోడిగుడ్డు అందిస్తున్నామన్నారు. బడిబయట పిల్లలు ఉండకుండా ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లిష్‌ విూడియంలో చదువుతుంటే వారెంతో గర్వపడుతున్నారన్నారు. గతంలో రేషన్‌ బియ్యం ఒక్కరికీ 4 కిలోల చొప్పున సీలింగ్‌ పెట్టి కేవలం 20 కిలోలే ఇచ్చేవారన్నారు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సీలింగ్‌ లేకుండారూ.1కే ఒక్కరికి ఆరు కిలోల చొప్పున అందిస్తుందన్నారు. కేసీఆర్‌ కిట్‌తో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.

 

Other News

Comments are closed.