కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌

share on facebook

జనసేనలోకి మాజీ స్పీకర్‌ నాదెండ్ల
గుంటూరు,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): ఎపిలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షౄక్‌ తగిలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  మాజీ స్పీకర్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. ఈ విషయాన్ని గురువారం ఆయన ధ్రువీకరించారు.  సాయంత్రం మనోహర్‌ తిరుమలకు వెళ్లనున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సైతం ఈరోజు రాత్రికి తిరుమలకు చేరుకోనున్నారు. శుక్రవారం  ఉదయం వారిద్దరూ కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం జనసేనలో చేరుతున్న విషయాన్ని నాదెండ్ల మనోహర్‌ అధికారికంగా ప్రకటించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఉన్న మనోహర్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకి కచ్చితంగా షాకేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇప్పటివరకు జనసేనలో ఇతర పార్టీల నుంచి కీలక నేతలెవరూ చేరలేదు. మనోహర్‌ రాకతో ఆ పార్టీ కేడర్‌లో మరింత ఉత్సాహం నెలకొంటుందని భావిస్తున్నారు. ఇకపతోఏ ఉమెన్‌ చాందీ  రాకతో ఉత్సాహం కనిపించిన దశలో పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది.

Other News

Comments are closed.