కాంగ్రెస్‌ వెన్నులో వణుకు పుడుతోంది

share on facebook

సిద్దిపేట,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): టీఆర్‌ఎస్‌ పార్టీ పేరు వినగానే కాంగ్రెస్‌ పార్టీకి వణుకు పుడుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పేర్కొన్నారు. ఆ పార్టీకి ఎన్నికలంటేనే భయం పట్టుకుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష ¬దా కూడా దక్కదన్నారు. ప్రగతి నివేదన సభ తర్వాత కాంగ్రెస్‌ నాయకులు పెట్టుకునే ప్రతి సభ.. ఆవేదన సభలే అని ఎద్దెవా చేశారు. ప్రగతి నివేదన సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో.. అది చూడలేక.. కాంగ్రెస్‌ నాయకులు సభపై దుష్పాచ్రారం చేస్తున్నారని మండిపడ్డారు. జాతరకు తరలినట్లుగా ప్రగతి నివేదనకు జనం తరలుతున్నారని తెలిపారు. రైతే రాజు అన్న కాంగ్రెస్‌ నాయకులు.. రైతు వెన్నెముక విరిచారు. కానీ సీఎం కేసీఆర్‌ రైతును రాజుగా చేశాడని పేర్కొన్నారు. కేసీఆర్‌ ప్రసంగం కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు.

————–

 

Other News

Comments are closed.