కాంగ్రెస్‌ సిఎం అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదు

share on facebook

గెలుపు కోసమే తమ ప్రయత్నమన్న జానా

నల్గొండ,నవంబర్‌5(జ‌నంసాక్షి ): కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు అసందర్భమైన విషయం అని… కాంగ్రెస్‌ అధికారంలోకి రావడమే ముఖ్యమని ఆ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మహాకూటమి విజయం సాదిస్తుందన్నారు. ఈనెల 8న కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇచ్చిన హావిూలు నెరవేర్చలేకనే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళారని ఆయన విమర్శించారు. హావిూలు అమలు చేసే ధైర్యం లేని నేతగా కెసిఆర్‌ మగిలిపోయారని అన్నారు. ఆయనను ప్రజలు నిలదీయడం ఖాయమని అన్నారు. కేసీఆర్‌ డబ్బు మూటలతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. నియంతలా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జానారెడ్డి తెలిపారు.

మహాకూటమిపై టీఆర్‌ఎస్‌ విమర్శలు సంస్కారహీనమని జానారెడ్డి మండిపడ్డారు. ఫ్రంట్‌ ఏర్పాటు పేరుతో కేసీఆర్‌ అన్ని రాష్ట్రాలు తిరిగారని, ఇప్పుడు ఆ పార్టీ నేతల మహాకూటమిని విమర్శించడం సమంజసంగా లేదన్నారు. నియంతృత్వ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు సంకీర్ణాల ఏర్పాటు సహజమేనని అభిప్రాయపడ్డారు.

 

 

Other News

Comments are closed.