కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడి మృతి

share on facebook

నల్లగొండ,జనవరి3(జ‌నంసాక్షి): హుజూర్‌నగర్‌ పట్టణానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, బ్లాక్‌ కాంగ్రెస్‌ మాజీ ఉపాధ్యక్షుడు యడ్లపల్లి రామయ్య (65) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పలువురు కాంగ్రెస్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా… యడ్లపల్లి రామయ్య  మృతికి పలువురు నాయకులు శివారెడ్డి, నాగన్న, వెంకట్రామయ్య, వేణుగోపాల్‌, బాచిమంచి గిరిబాబు, మజీద్‌ సంతాపం తెలిపారు.

Other News

Comments are closed.