కాలయాపనలకు ఇక కాలం చెల్లింది

share on facebook

విభజన కారణంగా అనేక సమస్యలు ఇప్పుడు ఎపిని,తెలంగాణను వెన్నాడుతున్నాయి. దాదాపు మూడున్నరేళ్ల కాలం తరవాత కూడా ఉమ్మడి సమస్యలపై ఇంకా కదలిక రావడం లేదు. అధికారంలో ఉన్న ఎన్‌డిఎ ప్రజలకు ఇచ్చిన హావిూలు అమలు అమలు చేస్తేనే తదుపరి ఎన్నికల్లో వారిని ప్రజలు వారిని గుర్తుంచుకుంటారు. ఈ దశలో సమస్యలపై హావిూని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపైన ఉంది. దీనిపై తప్పించుకునే కారణాలను ఇక ప్రజలు నమ్మరని గుర్తుంచుకోవాలి. ప్రజల భావోద్వేగాలను సవిూక్షించి కూడా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. రాష్టాన్రికి ఏదో మంచి జరగనుందన్న సంకేతాలు వెలువరించడం ఒక ఎత్తయితే, వాటిని చేస్తామన్న సంకేతాలు ఇవ్వడం మరో ఎత్తు. ఏది చేస్తారో అనడానికి కొంత చొరవ అవసరం. ముసుగులో గుద్దులాట లేకుండా సూటిగా సాగాలి. పార్లమెంటు ఎన్నికలకు ముందు పలు బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్రమోడీ ప్రజల్లో ఎన్నో ఆశలు కల్పించారు. అధికారంలోకి వచ్చాక హావిూలను గుర్తు పెట్టుకోకపోవడం,నిర్లక్ష్యంగా ఉండడం సరికాదు. తాము అధికారంలోకి వస్తే అంటూ..అనేక రకాల హావిూలను ఇచ్చి వాటిని నెరవేరుస్తామని ప్రజలకు హావిూ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్టాన్న్రి కాంగ్రెస్‌ పార్టీ అన్యాయంగా విడదీసిందని, ఒక ప్రాంతాన్ని దిక్కులేకుండా చేసిందని తీవ్ర విమర్శలు చేశారు. తాము అధికారంలోకి రాగానే ఆ లోపాన్ని సరిదిద్దుతామని నరేంద్ర మోడీ విస్పష్టంగా ప్రకటించారు. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలే గాకుండా దేశం యావత్తు నరేంద్రమోడీని గాఢంగా నమ్మారు. అందుకే ఆయన మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి ఘన విజయం చేకూర్చారు. అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కని తీర్పునిచ్చారు. ఈ అవకాశాన్ని వినియోగించు కోవడంలో బిజెపి పూర్తిగా విఫలం అయ్యింది. ప్రత్యేక ¬దా ఇచ్చేందుకు నిబంధనలు ఉంటాయనే విషయాన్ని అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఏ రకంగా ఆదుకుంటారో చెప్పాలి. కేంద్రం ఇచ్చే సాయం ఏదో బిచ్చమేసినట్లుగా కాకుండా రాష్టాల్ర హక్కుగా ఉండాలి. సమావేశాలు, భేటీలతో కాలయాపనకు సమయం లేదని కూడా గుర్తించాలి. తెలంగాణకు సంబంధించినంత వరకు గిరిజన విశ్వవిద్యాలయం, ఎయిమ్స్‌ ఏర్పాటు తదితర అంశాలను మరుగున పడేస్తున్నారు. అలాగే హైకోర్టు విభజనపైనా స్పష్టమైన హావిూ ఇవ్వడం లేదు. కేంద్రమంత్రిగా వెంకయ్యనాయుడు ఉన్నంతవరకు ఎపికి కొంత ప్రయోజనం కలిగింది. కానీ తెలంగాణ విషయంలో మాత్రం శీతకన్ను వేస్తూ వచ్చారు. బిజెపి కేవలం విమోచనపై పడుతున్న పట్టు సమస్యలపై పట్టించుకోవడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు విభజన సమస్యలను పూర్తిగా, సమగ్రంగా పరిష్కరించడంలో కేంద్రం చొరవ చూపడం లేదన్నది నిర్వివాదాంశం. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని తెలంగాణ ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగి మూడేండ్లు దాటుతున్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య హైకోర్టు, తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థలు, ఢిల్లీలోని ఏపీ భవన్‌, విద్యుత్‌ ఇంజినీర్లు, ఆర్టీసీ ఆస్తులు, ఉద్యోగుల విభజన వంటివన్నీ ఇంకా అలాగే ఉన్నాయి. వివాదాలుగా మారిన అంశాలను కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి పరిష్కరించడంలో విఫలమయ్యింది. పైగా సాచివేత వైఖరితో వివాదాలను పెంచిపోషిస్తున్నది. కేంద్రం తీరు విూ సమస్యలను విూరే పరిష్కరించుకోండి, మాకేం సంబంధం లేదనే విధంగా ఉందని ఉద్యోగ సంఘాల నేతలు దుయ్యబడుతున్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టంతోపాటు, 371డీ, రాష్ట్రపత్తి ఉత్తర్వుల్లో ఇచ్చిన హావిూల అమలులో కేంద్ర డీవోపీటీ అధికారులు కాలయాపన చేస్తున్నారని అంటున్నారు. స్థానికతను ప్రామాణికంగా తీసుకొని ఉద్యోగులను విభజించాలని తెలంగాణ ఉద్యోగులు

ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా కమలనాథన్‌ కమిటీ పరిస్కారం చూపలేకపోయింది. కేంద్రం కనుసన్నల్లోనే ఈ అన్యాయం జరిగిందని తెలంగాణ ఉద్యోగసంఘాల ఆరోపిస్తున్నాయి. పునర్వ్యవస్థీకరణచట్టం ప్రకారం తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థల ఆస్తులు ఏ ప్రాంతంలో ఉన్నవి ఆ ప్రాంతానికే చెందాలి. ఏపీ స్థానికత గల విద్యుత్‌ ఇంజనీర్లను ఏపీ సర్కార్‌ తీసుకోవడం లేదు. ఇవన్నీ చూస్తూ కూడా కేంద్రం న్యాయం చేయడానికి చొరవ తీసుకోవడం లేదు. అంతరాష్ట్ర బదిలీల్లోనూ అంతే. ఈ సమస్యను సులభంగా పరిష్కరించే అవకాశాలున్నా పట్టించుకోవడం లేదని ఉద్యోగ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక సమస్యలపై ప్రజల్లో ఇంకా అపోహలు ఉన్నాయి. కేవలం నోట్ల రద్దు, జిఎస్టీ వంటి అంశాలకే కేంద్రం ప్రాధాన్యం ఇస్తోంది. ప్రజల్లో ఉన్న ఆకాంక్షలను పట్టించుకోవడం లేదు. ఆహారాధాన్యాల ఉత్పత్తి పెరిగినా ధరలు దిగి రావడం లేదు. సామాన్యుడు నిత్యం ఉపయోగించే ఉల్లిధరలు మళ్లీ ఘాటెక్కిస్తున్నాయి. బ్యాంకుల తీరు కారణంగా సామాన్యలు జేబులకు చిల్లు పడుతోంది. సర్వీస్‌ ఛార్జీల పేరుతో బాదుతున్నా యి. నగదు అందని దుర్భర పరస్థితులు ఉన్నాయి. ప్రతి దానికి లెక్క చూపుమంటున్న వారు పేదల విసయంలో మాటలతో సరిపెడుతున్నారు. అచ్ఛేదిన్‌ పేరుతో ఊదరగొట్టిన ప్రధాని మోడీ ప్రజలు చస్తున్నా పట్టించుకోవడం లేదు. మూడున్నరేళ్ల కాలం మోడీకి తక్కువ సమయమేవిూ కాదు. పూర్తిస్థాయి మెజార్టీ ఉన్నా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. కేవలం కార్పోరేట్‌ కనుసన్నల్లోనే సర్కార్‌ నడుస్తోందన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుంది. ఈ భావన నుంచి బయటపడకపోతే విపక్షాలను ఎంతగా ముప్పుతిప్పలు పెట్టినా ప్రజలు తలచకుంటే మళ్లీ వాటికి ప్రాణం పోయగలరని పాలకులు గుర్తెరగాలి.

Other News

Comments are closed.