కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి

share on facebook

మెదక్‌,మే16(జ‌నం సాక్షి): చిన్నశంకరంపేట, మిర్జాపల్లి, కామారం తదితర గ్రామాల శివారులోని మరికొన్ని పరిశ్రమలు వాహనాల పాతటైర్లను ఉడికించి ఆయిల్‌ తీస్తూ విచ్చలవిడిగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయి. రాత్రుళ్లు మాత్రమే నడిపిస్తూ, పెద్దఎత్తున అక్రమ కలప వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నాయి.జనజీవనానికి విఘాతం కలిగిస్తోన్న పరిశ్రమలు స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు 5 శాతమైనా కల్పించడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇకనైనా వీటిపట్ల దృష్టిసారించి కఠిన చర్యలు తీసుకోవాలని, స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Other News

Comments are closed.