కాశీయాత్రికులను డీకొన్న లారీ: ముగ్గురు మృతి

share on facebook

విజయనగరం,జూన్‌13(జ‌నం సాక్షి ): విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. కాశీ నుంచి వస్తోన్నయాత్రికుల బస్సును లారీ ఢీకొట్టడంతో ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరికొద్ది గంటల్లో ఇంటికి చేరుకుంటారనగా అంతలోనే లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జయింది. మృతులంతా విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందినవారిగా తెలుస్తోంది. బస్సులో మరికొందరు ప్రయాణీకులు చిక్కుకున్నారు. తీవ్ర గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం సవిూపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా పలువురి యాత్రికుల ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదిలావుంటే విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆం/-రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగ్భాం/-రతి వ్యక్తం చేశారు. కొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా ప్రమాదం సంభవించడం కలచి వేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ కు సీఎం ఆదేశించారు.

 

Other News

Comments are closed.