కాశ్మీర్‌ ప్రజలపై రాజ్యహింసకొనసాగుతుంది

untitled-1
– అక్కడి వాస్తవాలు మీకు తెలుసా?

– ప్రధానమంత్రిగారు! ఇది కాశ్మీరు నిజం!!

– ప్రముఖ జర్నలిస్టు సంతోష్‌ భారితియ

ప్రియమైన ప్రధాన మంత్రిగారూ ! నాలుగు రోజులు కాశ్మీరులో గడిపి నేనిప్పుడిప్పుడే తిరిగి వచ్చాను. ఈ నాలుగు రోజులు కాశ్మీరు లోయలో గడిపిన నా అనుభవాలు, పరిస్థితులతో మీకు అవగాహన కలిగించాలని నాకనిపించింది. మీ వద్ద నుండి ఉత్తరానికి సమాధానం వచ్చే ఆచారం సమాప్తమైందని మీ సహచరులే చెబుతున్నారు. అయినా గాని, మీరు జవాబు పంపకపోయినా నా ఉత్తరాన్ని మాత్రం తప్పక చదువుతారనే ఆశతో పంపిస్తున్నాను. నా ఉత్తరం చదివిన తరువాత మీకు ఇందులో ఏ కొంచెం వాస్తవం అనిపించినా, ఇందులో లేపిన అంశాలపై తప్పక ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. జమ్మూ కాశ్మీరుకు సంబంధించి, ప్రత్యేకంగా కాశ్మీరు లోయకు సంబంధించి మీ వద్దకు చేరే వార్తలు, సమాచారం ప్రభుత్వాధికారుల ద్వారా, స్పాన్సర్‌ చేసినవే అయి ఉంటాయని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఈ వార్తలు, సమాచారంలో వాస్తవాలు తక్కువ. ఒకవేళ లయలోని ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వాస్తవాలేమిటో మీకు తెలుపే ఏదైనా మేకానిజం ఉండే ఈ వాస్తవాలను మీరు నిర్లక్ష్యం చేయరని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.

హైదరాబాద్‌,నవంబర్‌ 6(జనంసాక్షి):నేను లోయలోకి వెళ్ళి చలించిపోయాను. భూమి మన ఆధీనంలో ఉంది. ఎందుకంటే మన సైన్యాలు అక్కడున్నాయి. కాని కాశ్మీరు ప్రజలు మనతో లేరు. నేను పూర్తి బాధ్యతాయుతంగా ఈ విషయాన్ని మీ దృష్టిలోకి తెస్తున్నాను. 80 సంవత్సరాల ముదుసలి మొదలుకొని 6 సంవత్సరాల బాలుని వరకు భారతీయ వ్యవస్థ పట్ల వారి హృదయాలు కోపంతో నిండి ఉన్నాయి. ఈ కోపం ఎంత తీవ్రంగా ఉందంటే భారతీయ వ్యవస్థతో ముడిపడి ఉన్న ఏ ఒక్క వ్యక్తితో వారు మాట్లాడ దలుచుకోలేదు. వారిలో ఈ క్రోధాగ్ని ఎంత తీవ్రంగా ఉందంటే చేయిలో రాయి పట్టుకొని ఇంత గొప్ప  మెకేనిజం ను ఎదుర్కొంటున్నారు. ఇక ఇప్పుడయితే వారు ఎంత గొప్ప ప్రమాదాన్నైనా సరే, ఎదుర్కొవడానికి సిద్ధపడ్డారు. ఈ ప్రమాదాల్లో అన్నిటికన్నా పెద్ద ప్రమాదం మానవ సంహారం అనేది. ఏ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఈ వాస్తవాన్ని తెలుపుతున్నానంటే ఈ శతాబ్దంలో కాశ్మీరులో జరుగబోయే అతిపెద్ద మానవ సంహారాన్ని ఆపడంలో మీ పాత్ర అత్యంత కీలకమైంది. మన సెక్యూరిటీ ఫోర్సెస్‌లో, మన సైన్యంలో ఒక భావన చాల తీవ్రంగా వ్యాపిస్తూ పోతున్నది. ”కాశ్మీరులో సిస్టం (వ్యవస్థ)కు వ్యతిరేకంగా ఎవరు తిరగబడినా, అతన్ని సమాప్తం చేసేయాలి. చంపేయాలి, అతన్ని ఈ లోకంలో లేకుండా చేయాలి. అప్పుడే కాశ్మీరు ప్రజల ఉద్యమం. 80 సంవత్సరాల ముదుసలి మొదలుకొని 6 సంవత్సరాల పసిబాలుని వరకు ప్రతి ఒక్కడు స్వాతంత్రం, స్వాతంత్రం, స్వాతంత్రం అంటున్నాడంటే గడచిన 60 సంవత్సరాల కాలంలో మనతో గొప్ప పొరపాట్లు జరిగిపోయాయని మనం అంగీకరించాల్సి          ఉంటుంది. ఇంకా ఆ పొరపాట్లు, తప్పులు కావాలని జరిగాయి. ఈ పొరపాట్లను, తప్పుల్ని సరిదిద్దే అవకాశాన్ని చరిత్ర, సమయం మీకు అప్పగించింది. కాశ్మీరు పరిస్థితుల్ని వెంటనే, సరికొత్త పంథాలో అధ్యయనం చేసి మీ ప్రభుత్వం వేసే ముందడుగును నిర్థారణ చేసుకుంటారని విశ్వాసముంది. ప్రధానమంత్రిగారూ ! కాశ్మీరులోని పోలీసులు మొదలుకొని వ్యాపారుల వరకు, అక్కడి విద్యార్థులు, అక్కడి సివిల్‌ సొసైటీ వారు, అక్కడి బుద్ధి జీవులు, అక్కడి రచయితలు, పాత్రికేయులు, అక్కడి రాజకీయ పార్టీల కార్యకర్తలు, అక్కడి ప్రభుత్వాధికారులు – వారు స్వయంగా కాశ్మీరు నివాసస్తులైనా లేక బయటి ప్రాంతాల నుండి వచ్చి కాశ్మీర్‌లో పనిచేస్తున్న వారైనా సరే, వీరందరూ అనేదేమిటంటే సిస్టం ద్వారా గొప్ప పొరపాటు జరిగిపోయింది. అందుకనే కాశ్మీరులోని ప్రతి వ్యక్తి భారతీయ వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఎవరి చేతిలో రాయి లేదో అతని గుండెలో రాయి ఉంది. అదిప్పుడు ప్రజాఉద్యమంగా మారిపోయింది. క్రీ.శ. 1942లో భారతదేశంలో ఎలా            ఉద్యమం లేచిందో, లేక ఏ విధంగానైతే జయప్రకాశ్‌ ఉద్యమం లేపాడో ఈ ఉద్యమం అచ్చం అలాగే ఉంది. గడిచిన ఈ             ఉద్యమాల్లో లీడర్‌ పాత్ర తక్కువ, ప్రజల పాత్రే ఎక్కువుండేది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతున్నది. ఈసారి కాశ్మీరులో బక్రీదు పండగ జరుపుకోబడలేదు. ఎవరూ కొత్త బట్టలు వేసుకోలేదు. ఎవరూ ఖుర్బానీ చేయలేదు. ఎవరి ఇండ్లలోనూ పండగ సంబరాలు జరుపుకోబడలేదు. ప్రజాస్వామ్యం గురించి ఒట్లు పెట్టుకునే భారతీయులందరి ముఖాలపై ఇదో చెంప పెట్టుకాదా ? ఏమి జరిగిపోయిందని కాశ్మీరు ప్రజలు ఉత్సవాలు జరుపుకోవడం మానేశారు ? పండుగలు, బక్రీద్‌ లాంటి పండగలు జరుపుకోవడం మానేశారు ? ఈ ఉద్యమం అంతాకూడా అక్కడి రాజకీయ నాయకత్వాలకు వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు ఉద్యమ రూపం దాల్చింది. ఏ కాశ్మీరులోనైతే 2014లో జరిగిన ఎన్నికల్లో ప్రజలంతా ఓటు వేశారో, అదే నేటి  కాశ్మీరులో ఏ ఒక్క వ్యక్తి కూడా భారతీయ వ్యవస్థ పట్ల సానుభూతితో కూడిన ఒక్క పదం కూడా ఉచ్చారించటానికి సిద్ధంగా లేదు. నేనేందుకు ఈ పరిస్థితుల్ని మీకు వివరిస్తున్నానంటే, మీరు మొత్తం భారతావనికి ప్రధాన మంత్రులు, గనక దీనికి ఏదైనా పరిష్కార మార్గాన్ని కనుగొంటారనే ఆశతో.

కాశ్మీరులోని ఇళ్ళలో ప్రజలు కేవలం ఒక బల్పు వెలిగించి రాత్రిళ్ళు వెళ్ళ దీసుకుంటున్నారు. అత్యధిక మంది అనుకునేదేమి టంటే, మరెన్ని బాధలు చుట్టు ముట్టాయంటే, ఎన్ని హత్యలు జరిగాయంటే, పదివేలకు మించి పేలెటి గన్లతో ప్రజలు గాయపడ్డారు, పదివందలకు మించి ప్రజల కళ్ళుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాలుగేసి బల్బులు ఇంట్లో వెలిగించి సంతోషాన్ని ఎలా వ్యక్తం చేయగలుగుతారు ? అందుకని కేవలం ఒకే బల్బుతో గడుపుకుంటాము. ప్రధానమంత్రిగారు, కాశ్మీరులో ప్రజలు కేవలం ఒకే బల్బుతో గడపడం నేను చూశాను. కాశ్మీరులో నేను ఇంకా ఇది కూడా చూశాను.           ఉదయం ఎనిమిది గంటలకు రోడ్లపై రాళ్ళు జమ చేస్తారు, 6 గంటలకు స్వయంగా ఆ కుర్రాళ్ళే ఎవరయితే ఉదయం          రాళ్ళు జమ చేశారో, రోడ్ల మీద నుండి రాళ్ళు తీసేస్తారు. పగలంతా వారు రాళ్ళు రువ్వుతుంటారు. ఇక సాయంత్రం, రాత్రి కాగానే ఏ సమయంలో సెక్యూరిటీ వారొచ్చి తమను లేపుకుపోతారో, ఇంకా తాము తిరిగి తమకు ఇళ్ళకు వస్తామో, రామో అనే దిగులుతో నిదురపోతారు. ఇలాంటి పరిస్థితి ఆంగ్లేయ ప్రభుత్వకాలంలో కూడా లేకుండేది. ఇలాంటి మానసిక స్థితిని, దేన్నైతే మనం చరిత్రలో చదువుతూ వచ్చామో, ఆనాటి సామాన్య ప్రజల్లో ఇలాంటి భయం లేకుండేది. కాని నేను కాశ్మీరులో నివసించే ప్రతి వ్యక్తి, అతను హిందుకాని ముస్లింకాని, ప్రభుత్వ ఉద్యోగి అయినా కాకపోయినా, నిరుద్యోగికాని వ్యాపారి కాని, కూరగాయలు అమ్ముకునేవాడు, టేలాబానీ నడుపుకునే వాడు, టాక్సీనడిపేవాడు, ఎవ్వరైనా కానివ్వండి, ప్రతి మనిషి బెదిరిపోయి ఉన్నాడు. ఇంకా బహుశ – నాకు విశ్వాసమైతే కలుగడం లేదుగాని ఒక అనుమానం మాత్రముంది – మనం వారిని ఇంకా బెదిరించటానికి, వారిని ఇంకా భయభ్రాంతులకు గురిచేసే పాలసీని అనుసరించడం లేదు కదా ! అని.

గడిచిన 60 సంవత్సరాల కాలంలో మన వ్యవస్థ యొక్క తప్పిదం, పొరపాటు, నిర్లక్ష్యం లేక క్షమార్హం కాని ఏమరుపాటు కారణంగా కాశ్మీరు ప్రజలకు ఒక విషయం జ్ఞాపకం వచ్చేసింది. అది కాశ్మీరులను భారత్‌తో కలిపే ఒప్పందం – దీన్ని ఇక్కడి వారు ”ఏకార్డ్‌” అంటారు. మహారాజా హరిసింగ్‌ మరియు భారత ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందానికి సాక్ష్యంగా ఉన్న మహారాజా అరిసింగ్‌ తనయుడు కరణ్‌ సింగ్‌ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇందులో స్పష్టంగా పేర్కొనబడిన విషయం – అధికరణం – 370. కాశ్మీరు ప్రజలు తమ భవిష్యత్తు గురించి రెఫరెండం ద్వారా తమ చివరి అభిమతం తెలుపేంతవరకు  ఈ అధికరణం అంటే 370 అమలులో ఉంటుంది. కాశ్మీరు ప్రజలు ఈ రెఫరెండం విషయాన్ని నాలుగైదు సంవత్సరాలలోనే మరిచిపోయారు. షేఖ్‌ అబ్దుల్లా విజయవంతంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కాని ప్రధాన మంత్రిగారూ ! భారత మొదటి ప్రధాన మంత్రి ఎప్పుడైత షేఖ్‌ అబ్దుల్లాను జైల్లో పడేశాడో, అప్పటి నుండి కాశ్మీరు ప్రజల్లో భారతదేశం పట్ల అపనమ్మకం ఏర్పడింది. 1974లో షేఖ్‌ అబ్దుల్లా మరియు ప్రధానమంత్రి ఇందిరాగాంధీల మధ్య ఒప్పందం కుదిరి షేఖ్‌ అబ్దుల్లా తిరిగి కాశ్మీర్‌ ముఖ్యమంత్రిగా నియమించటం జరిగింది. షేఖ్‌ అబ్దుల్లా, పండిత్‌ నెహ్రూ చివరి రోజుల్లో పాకిస్తాన్‌ కూడా వెళ్ళి వచ్చాడు. ఇంకా ఆయన ఇందిరా గాంధీతో ఒప్పందం కుదిరిన తరువాత తన ప్రభుత్వాన్ని కూడా నడిపాడు. కాని ఆయన కేంద్ర ప్రభుత్వం నుండి ఏఏ విషయాలు కావాలని డిమాండ్‌ చేసాడో ప్రభుత్వం అది నెరవేర్చలేదు. ఇంకా కాశ్మీర్‌ ప్రజల హృదయాలకు వేరే గాయలయ్యాయి

1982లో మొదటిసారి షేఖ్‌ అబ్దుల్లా కుమారుడు ఫారూఖ్‌ అబ్దుల్లా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎలెక్షన్లో దిగి విజయం సాధించాడు. ఢిల్లీలో కూర్చుని ఉన్న కాంగ్రెస్‌, బహుశా కాశ్మీరుని తన కాలనీ అనుకున్నదేమో, ఫారూఖ్‌ అబ్దుల్లా ప్రభుత్వాన్ని పడగొట్టింది. ఫారూఖ్‌ అబ్దుల్లా విజయం అపజయంగా మారిపోయింది. ఇక్కడి నుండే కాశ్మీరు ప్రజల హృదయాల్లో భారతీయ వ్యవస్థ పట్ల విద్వేషం మొలకెత్తింది. మీరు ప్రధానమంత్రి పదవి చేపట్టక ముందు వరకు, ఢిల్లీలో కూచ్చున్న ప్రభుత్వాలన్నీ కూడా, భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు ఏ విధంగా భారత ప్రభుత్వ వ్యవస్థలోని అవిభాజ్య విభిన్న అంశాలని, కాశ్మీరు కూడా అలాంటి అంశమే అని కాశ్మీర్‌ ప్రజల్ని నమ్మించలేక పోయాయి. కాశ్మీరులో 1952 తరువాత జన్మించిన ఒక పూర్తితరం, అవి నేటి వరకు కూడా ప్రజాస్వామ్య పేరు కూడా విని ఉండలేదు. అవి నేటి వరకు కూడా ప్రజాస్వామ్యపు రుచినే ఆస్వాదించలేకపోయింది. ఈ తరం అక్కడ సైన్యాన్ని చూసింది, పేరా మిలిటరీ బలగాల్ని చూసింది. బుల్లెట్లను చూసింది. మందుగుండును, మృత్యువును చూసింది. మనం ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్‌లో, బెంగాల్‌, మహారాష్ట్ర మరియు గుజరాత్‌లలో ఎలా బ్రతుకుతున్నామో, ఏ విధంగా ప్రజాస్వామ్యపు విలువల్ని గుర్తు చేస్తూ, ప్రజాస్వామ్యం పేరుతో నడుస్తున్న వ్యవస్థ ఫలాలను ఆస్వాధిస్తున్నామో, కాశ్మీరులోని ఈ తరం వారికి ఆ వాసనే తగులలేదు. ప్రజాస్వామ్య అభిరుచుల్ని ఆస్వాధించటానికి, ప్రజాస్వామ్య మనే హాయి గొలిపే సముద్రంలో ఈదడానికి కాశ్మీరు ప్రజలకు హక్కులేదా ? లేక వారి అదృష్టంలో కేవలం బుల్లెట్లు, ట్యాంకులు, పేలెట్‌ గన్లు ఇంకా పొంచి ఉన్న ఆ నరసంహారమే ఉందా ?

ప్రధానమంత్రిగారూ ! ఈ విషయాలు నేనేందుకు మీకు తెలుపుతున్నానంటే కాశ్మీర్‌లోని ప్రతి వ్యక్తి పాకిస్తాన్‌ అని మాటకు ముందే మీకు చేరవేయడం జరిగింది. కాని మాకైతే ఒక్క వ్యక్తి కూడా పాకిస్తాన్‌ను ప్రశంసిస్తూ కాశ్మీరులో కనిపించలేదు. అయితే వారు ఇప్పడు ఒక విషయం ఇలా తెలిపారు : ”మీరు మాతో ఏ వాగ్ధానమైతే చేశారో దాని ప్రకారం మాకు భుక్తినయితే ఇచ్చారు కాని చెంప పెట్టు వేస్తూ ఇచ్చారు. మీరు మమ్మల్ని హీనంగా చూశారు. మీరు మమ్మల్ని అవమానించారు. ప్రజాస్వామ్యపు వెలుగు కూడా మాకు సోకకుండా మీకు కుట్ర చేశారు” .. అందుకే స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా ఈ ఉద్యమం కాశ్మీరు గ్రామాల వరకు పాకిపోయింది. ప్రధానమంత్రిగారూ ! మేము ప్రతిచెట్టు మీద, ప్రతి మొబయిల్‌ టవర్‌ మీద ప్రతి చోట పాకిస్తాన్‌  జెండా ఎగురుతూ చూశాము. దీని గురించి మేము అడగ్గా వారు ”లేదు, మేము పాకిస్తాన్‌ వెళ్ళదలుచుకోలేదు. కాని మీరు పాకిస్తాన్‌ అంటే మండిపడతారుగా అందుకని మిమ్మల్ని ఏడిపించటానికి, వెక్కిరించటానికే ఈ జెండాను ఎగురవేస్తాం !” ఇలా అంటున్నప్పుడు అక్కడున్న అత్యాధికుల్లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. కాశ్మీరు ప్రజలకు భారత వ్యవస్థను, అధికారాన్ని ఏడిపించటానికి, వెక్కిరింత కోసమే భారతజట్టు క్రికెట్‌లో ఓడిపోయినప్పుడల్లా ఉత్సవం జరుపుకుంటారు. వారు కేవలం పాకిస్తాన్‌ గెలిచినపుడు సంబరాలు జరుపుకోరు. మనం న్యూజీల్యాండ్‌తో ఓడిపోయినా, బంగ్లాదేశ్‌ లేక శ్రీలంకతో ఓడిపోయినా కూడా వారు ఆనందాన్ని అనుభవిస్తారు. దీని ద్వారా వారు భారత వ్యవస్థలోని ప్రతి సంతోషాన్ని, ప్రతి సందర్భాన్ని వ్యతిరేకించి తమ నిరసన భావనల్ని వ్యక్తీకరిస్తున్నామని భావిస్తారు. ప్రధానమంత్రిగారూ ! ఈ మానసికతను, మనస్తత్వాన్ని భారత ప్రభుత్వం అర్థం చేసుకోవలసిన అవసరం లేదంటారా? కాశ్మీరు, ప్రజలు మనతో ఉండలేకపోతే, కాశ్మీరు భూభాగాన్ని తీసుకొని మనమేం చేసుకుంటాం ? కాశ్మీర్‌ నేలపై ఏవీ పండదు. అంతే కాకుండా అక్కడ టూరిజమూ ఉండదు, ప్రేమ, వాత్సల్యాలూ ఉండవు. కేవలం ఒక ప్రభుత్వం ఉంటుంది. మన సైన్యం ఉంటుంది. ప్రధానమంత్రిగారూ ! కాశ్మీరు ప్రజలు స్వయం నిర్ణయాధికారం కోరుతున్నారు. వారనేదేమిటంటే మేము భారతదేశంతో కలిసి ఉండదలిచామా లేక పాకిస్తాన్‌తో కలిసి ఉండదలిచామా లేక స్వతంత్ర దేశంగా ఉండదలిచిమా  అనే విషయాన్ని మీరు ఒక్కసారి మమ్మల్ని తప్పక అడగండి. ఈ రెఫరండం లేక అభిమతాన్ని వారు కేవలం భారతదేశ అధికారంలో ఉన్న కాశ్మీరు వరకే పరిమితం చేయటం లేదు. పాకిస్తాన్‌ అధీనంలో నున్న కాశ్మీరు, గిల్‌గిల్‌, బిల్తిస్తాన్‌ – ఈ మూడు ప్రాంతాల కొరకు కూడా వారు ఈ రెఫరెండంను కోరుతున్నారు. దీనికోసం భారతదేశం పాకిస్తాన్‌తో సంభాషణ జరుపాలని, తామిక్కడ నిర్ణయాధికారం ఇస్తే, పాకిస్తాన్‌ కూడా అక్కడి వారికి ఆ అధికారం ఇవ్వాలని పాకిస్తాన్‌ను అడగాలని వారు కోరుతున్నారు. ప్రధానమంత్రిగారూ ! ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది ? ఈ పరిస్థితి ఏర్పడతున్నారు. ప్రధాన మంత్రిగారూ ! ఈ పరిస్థితి ఏర్పడడానికి కారణం ఏమిటంటే నేటివరకు మన పార్లమెంట్‌ నాలుగు ప్రతినిధి బృందాలను కాశ్మీరు పంపించింది. సర్వదళ సభ్యులతో కూడుకున్న ఈ నాలుగు పార్లమెంట్‌ బృందాలు కేంద్ర ప్రభుత్వానికి ఏమని రిపోర్టులు ఇచ్చాయో ఎవరికీ తెలియదు. కాని అవి ఏ రిపోర్టు లిచ్చినా వాటిపై ఆచరణ మాత్రం జరుగలేదు. ప్రభుత్వం తన తరపున రాంజెఠ్మలాని మరియు శ్రీ కె.సి. పంత్‌లను తమ రాయుబారులుగా పంపించింది. వారిక్కడ ఎంతో మందిని కలిశారు. ఎంతో మందితో మాట్లాడారు. వారొచ్చి ప్రభుత్వానికి ఏమని చెప్పారో ఎవరికీ తెలియదు. మీకంటే ముందున్న ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌ ప్రభుత్వం ‘ఇంటర్‌ లో కేటర్స్‌ ‘ ల టీం ను ఏర్పాటు చేసింది. అందులో పడ్‌గాల్‌కర్‌, రాధాకుమార్‌, ఎం.ఎం, అన్సారీ ఉన్నారు. వారిచ్చిన రిపోర్టు ఏమిటో ఎవరో తెలియదు. దానిపై చర్చ జరగలేదు. వాద ప్రతివాదాలు జరుగలేదు. జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ తమకు ఏ హక్కు కావాలో కోరుతూ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. దాన్ని చెత్తబుట్టలో పడేయడం జరిగింది. కాశ్మీరు ప్రభుత్వాన్ని తాము నడుపుకోమని, ఢిల్లీలో కూర్చున్న కొందరు అధికారులు నడుపుతారని, ఇంటెలిజెన్స్‌ బ్యూరో నడుపుతుందని, సైనిక అధికారులు నడుపుతారని కాశ్మీరు ప్రజలు భావిస్తారు. మేమైతే ఇక్కడ బానిసల్లా బ్రతుకు తున్నామని, తమకు భుక్తి నయితే ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతున్నది, కాని బ్రతికే ఏ మార్గం తమకు తెరిచిలేదని వారు వాపోయారు. ప్రధానమంత్రి గారూ ? కాశ్మీరు కనీసం ఏ డబ్బు అయితే (కేంద్రం మంది) విడుదుల అవుతుండక, అది కాశ్మీర్‌ ప్రజలవరకు చేరదు. కాశ్మీరుకు ఎన్ని ప్యాకేజీలైతే మంజూరు చేయబడ్డాయో, అవి వారి వరకు చేరనే లేదు. గడిచిన దీపావళి (2014) మీరు కాశ్మీర్‌ ప్రజల మధ్య గడిపారు. అప్పుడక్కడ గొప్ప వరద భీభత్సం జరిగిందని, అపారనష్టం వాటిల్లిందని, అందుకని ఇన్ని వేల కోట్ల ప్యాకేజీ కాశ్మీరుకు ఇవ్వబడుతుందని మీరు ప్రకటన చేశారు. ప్రధానమంత్రిగారూ ! ఆ ప్యాకేజ్‌ అందనే లేదు. అందులోని కొంత భాగాన్ని దివంగత ముఫ్తి మహమ్మద్‌ సయీద్‌ మరణం తరువాత మహబూబ ముఫ్తి ఒత్తిడితో కొంచెం డబ్బును విడుదల చేశారు. కాశ్మీరు ప్రజలకు ఇది పరిహాసంగా కన్పిస్తుంది. దీన్ని వారు తమ అవమానంగా భావిస్తారు. ప్రధానమంత్రిగారూ ! ఇంతవరకు ఎన్ని పార్లమెంట్‌ ప్రతినిధి బృందాలు కాశ్మీరుకు వెళ్ళి వచ్చి తమ రిపోర్టులను సమర్పించాయో, ఇంటర్‌ లోకేటర్స్‌ రిపోర్టు, కెసి పంత్‌, రాంజెఠ్మలాని రిపోర్టు, ఇంకా కాశ్మీరు గురించి ఎవరెవరూ ఏఏ రిపోర్టులు, ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించారో, వాటన్నిటి అభిప్రాయ సేకరణ చేసి, మన రిటైర్డ్‌ చీఫ్‌ జస్టిస్‌ల ఓ ఏడెనిమిది మందితో కూడిన ఒక ప్యానల్‌ను ఏర్పాటు చేసి, వారికి ఆ రిపోర్టులు సమర్పించి, అందులోని ఏఏ అంశాలు వెంటనే కాశ్మీరులో అమలు జరుపడానికి అనుకూలంగా ఉంటాయో సూచించమని వారిని కోరలేమా ? ఇది సంభవం కాదా ? లేక ఇంటర్‌లోకేటర్స్‌ రిపోర్టును ఎలాంటి షరతు లేకుండా అక్కడ పరిచయం చేసి, దానిపై ఆచరింపజేయలేమా ? పైన పేర్కొంటూ వచ్చిన ఈ అన్ని విషయాలరు నేటివరకు ఆచరణకు నోచుకోలేదు. అందుకనే కాశ్మీరు ప్రజలు స్వాతంత్రాన్ని కోరుతున్నారు. ఇంకా ఈ స్వాతంత్ర కాంక్ష ఎంతగా పెరిగిపోయిందంటే ప్రధానమంత్రి గారూ ! పునారావృతం చేస్తున్నందుకు మన్నించాలి. పోలీసులు మొదలుకొని 80 ఏళ్ళ ముదుసలి వరకు, రచయితలు, పాత్రికేయులు, వ్యాపారులు, టాక్సీడ్రైవర్లు, హౌస్‌బోట్‌ నడిపేవారు మొదలుకొని 6 సంవత్సరాల బాలుని వరకు ప్రతి ఒక్కరూ స్వాతంత్య్రాన్ని కొరుతూ నాకు కన్పించారు. ఒక్కవ్యక్తి కూడా తిరిగి చెబతున్నాను, ఒక్క వ్యక్తి కూడా పాకిస్తాన్‌ పోతానని చెప్పినవాడు నాకు కనిపించలేదు. పాకిస్తాన్‌ పరిస్థితి ఏమిటనేది వారికి తెలుసు. నేడు ఏ చేతుల్లో రాళ్ళున్నాయో ఆ రాయిని పట్టుకునే శక్తి ఎవరు ప్రసాదించారంటే అది మన వ్యవస్థ మాత్రమే.

ప్రధానమంత్రిగారూ ! నా మదిలో ఓ పెద్ద ప్రశ్న మెదలుతున్నది. రాళ్ళు రువ్వే పిల్లలకు ప్రతిరోజు ఐదువందల రూపాయ లిచ్చేంత గొప్పదేశమాపాకిస్తాన్‌ ? అక్కడ రోజూ ఐదు వందల రూపాయలు పంచుతూ తిరగగానే ఒక్క మనిషిని కూడా పట్టుకోలేనంతగా చెడిపోయిందా మన వ్యవస్థ ? నలువైపుల కర్ఫ్యూ ఉంది. ప్రజలు రోడ్లపై రాలేకపోతున్నారు. ఐదు వందలు పంచటానికి వాడవాడకు ఎవరు తిరుగుతున్నాడు ?

మొత్తం అరువై లక్షల జనాభాను, 125. కోట్ల జనమున్న దేశానికి వ్యతిరేకంగా నిలుపడానికి పాకిస్తాన్‌ అందశక్తివంతమైన దేశమా ? ఇదైతే నాకు పరిహాసం అనిపిస్తుంది. కాశ్మీరు ప్రజలకు కూడా ఇది పరిహాసంగానే తోస్తున్నది. కాశ్మీరు ప్రజలకు మన వ్యవస్థలోని ఒక భాగమైన మీడియా పట్ల కూడా తీవ్ర ఆక్షేపణ ఉన్నాయి. వారెన్నో చానల్ల పేర్లు చెబుతారు. వాటిని చూసి ఇవి దేశమంతిటిలో మతతత్వాన్ని రెచ్చగొట్టే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయా అన్నట్లుగా తోస్తుంది. వీటిలోని కొన్ని ముఖ చానల్లు ఆంగ్ల భాషని, కొన్ని హిందీ చానల్లు కూడా ఉన్నాయి. మాలోని కొందరు పాత్రికేయ మిత్రులు రాజ్యసభలో సీటు సంపాదించటానికి, లేక పాత్రికేయ చరిత్రలో తమ పేరును ఫస్ట్‌ క్లాస్‌లో వ్రాయించుకోవటానికి ఎంతగా గుడ్డివారయ్యా రంటే వారు దేశ సమైక్యత, సమగ్రతులతో కూడా చెలగాటమాడుతున్నారు. కాని ప్రధానమంత్రి గారూ ! చరిత్ర అనేది నిరంకుశమైనది. అది ఇలాంటి పాత్రికేయుల్ని దేశభక్తులుగా కాకుండా దేశద్రోహులుగా పరిగణిస్తుంది. ఎందుకంటే ఇలాంటి వారు, ఎవరయితే ప్రతి విషయంలో పాకిస్తాన్‌ పేరెత్తుతారో లేక ప్రతి సంఘటనలో పాకిస్తాన్‌ హస్తాన్ని చూస్తుంటారో, నిజానికి వారు పాకిస్తాన్‌ దళారులు. వీరు పాకిస్తాన్‌ ఒక శక్తివంతమైన దేశమైనట్లు, బాగా సుసంఘటిత దేశమైనట్లు, అత్యంత సూక్ష్మగ్రాహి దేశమైనట్లు భారతప్రజల్లో, కాశ్మీరు ప్రజల్లో మానసికంగా ఇలాంటి భావనల్ని జన్మింపచేస్తున్నారు. ప్రధాన మంత్రిగారూ ! ఇలాంటి వారికి బుద్ధి ఎప్పుడొస్తుందో అసలు వస్తుందో, రాదో కూడా తెలియదు. అయితే నాకు ఇలాంటి వారి గురించి ఎలాంటి చింతలేదు. నా చింతంతా భారతదేశ ప్రియ ప్రధానమంత్రి అయిన నరేంద్రమోడీ గారి గురించే ఉంది. చరిత్ర ఒకవేళ నరేంద్రమోడీని – ఆయన కాశ్మీరులో ఒక గొప్ప నరసంహారం జరిపించి, కాశ్మీరును భారతదేశంతో కలిపి ఉంచాలనే రూపంలో ఆయన్ను ప్రదర్శిస్తే రాబోయే తారలకు అత్యంత విశాదకరమైన చరిత్ర అవుతుంది. నరేంద్రమోడీని కాశ్మీరు ప్రజల హృదయాల్ని గెలిచిన వారి రూపంలో చరిత్ర ప్రదర్శించాలి. అరవై సంవత్సరాల నుండి కాశ్మీరు ప్రజలతో చేస్తూ వచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తానని వారిని విశ్వాసంలోకి తీసుకున్న వ్యక్తిగా ప్రదర్శితం కావాలి. కాశ్మీరు ప్రజలు వెండి బంగారాలను, వజ్రాలను కోరడం లేదు. కాశ్మీరు ప్రజలు ఆత్మగౌరవాన్ని కోరుతున్నారు. ప్రధానమంత్రిగారూ ! నేనెన్ని వర్గాల వారితో మాట్లాడానో వీరంతా స్టేక్‌ హోల్టర్లు.

ప్రధానమంత్రిగారూ ! వీళ్ళందరూ స్టేక్‌ హోల్డర్లు. వారిలో హురియత్‌ వారు కూడా ఉన్నారు. కాశ్మీర్‌ ప్రజలపై హురియత్‌ నేతల నైతిక ఒత్తిడి ఎంత బలీయంగా ఉందంటే వారు శుక్రవారం రోజున ఏ క్యాలండర్‌ నైతే జారీ చేస్తారో, అది ప్రతి ఒక్కరి వద్దకు చేరుకుంటుంది. పత్రికల్లో ప్రచురిస్తే ప్రతి ఒక్కరికీ తెలిసిపోతుంది. ఇంకా ప్రజలు ఏడు రోజులు ఈ క్యాలండరు అనుసరించే నడుస్తుంటారు. 6 గంటల వరకు బజార్లు బంద్‌ కావాలంటే 6 గంటలకే మూత బడతాయి. అదే విధంగా 6 గంటలకు తెరువ బడాలంటే సరిగ్గా 6 గంటలకే తెరువబడతాయి. ప్రధాన మంత్రిగారూ ! మీ వ్యవస్థ క్రిందికి వచ్చే బ్యాంకులు సైతం 6 గంటలకే తెరవబడతాయి. ప్రధాన మంత్రిగారూ ! మీ వ్యవస్ధ క్రిందికి వచ్చే బ్యాంకులు సైతం 6 గంటల తరుఆటవతనే తెరువబడుతున్నాయి. అక్కడ మన సెక్యూరిటీ ఫోర్సెస్‌ వారు 6 గంటల తరువాత తిరుగుతూ కనిపించరు. 6 గంటలకు పూర్వం వరకు వారక్కడ గస్తీ తిరుగుతుంటుంది. అందుకనే మన కోర్‌ కమాండరు అక్కడి ప్రభుత్వంతో ఇలా అంటాడు : ”మమ్మల్ని ఈ రాజకీయ పోరాటంలో ఇరికించకండి, మేము సివిలియన్‌ ప్రజల కోసం కాదు, శత్రువు కోసం ఉన్నాము”.

అందుకనే ఎక్కడైతే సైన్యానికి ఎదురు పడతారో, వారు రియికి జవాబు బుల్లెట్‌తో ఇస్తారు. ప్రజలు మృత్యువాత పడుతుంటారు. అయితే సైన్యం యొక్క ఈ పాత్రను గురించి ఆలోచించాల్సి ఉంది. సైన్యం అనేది దేశ ప్రజల అసంతృప్తి, అలజడుల్లో వారికి వ్యతిరేకంగా శాంతి భద్రతల్ని కాపాడడం కోసం ఉద్దేశించబడును. సెక్యూరిటీ ఫోర్సెస్‌ వారు పేలెట్‌ గన్స్‌ పేల్చుతారు. అయితే వారి గురి నడుమకు కింద ఉండదు. నడుము పైభాగం పై ఉంటుంది. అందుకనే పదివేల మంది గాయాలపాలై ఆసుపత్రుల్లో పడి ఉన్నారు. ప్రధానమంత్రిగారూ ! కాశ్మీర్‌ పర్యటనలో నేను ఆసుపత్రులకు కూడా వెళ్ళాను. నాలుగైదు వేల మంది పోలీసులు కూడా గాయపడ్డారని నాకు తెలుపబడింది. సెక్యూరిటి ఫోర్సెస్‌ వారు కూడా కొందరు గాయపడ్డారు. రాళ్ళతో గాయపడ్డ వారయితే నాకు కనిపించారు. కాని వారి సంఖ్య బహు స్వల్పంగా ఉంది. వేల సంఖ్య అనేది ప్రచార వ్యవస్థ చేసే ప్రపగండా. దాన్ని ఎవరూ నమ్మరు. ఒకవేళ ఇదే గనుక సత్యమైనట్లయితే, వేల సంఖ్యలో చికిత్స పొందుతున్న ఆ జవాన్లు ఎక్కడున్నారో మా పాత్రికేయులకు చూపించమనండి. కాని గాయపడ్డవారు భూమ్మీద బెడ్‌పై ఇద్దరిద్దరు అడ్జస్ట్‌ చేసుకొవడాన్ని షేరింగ్‌ చేసుకోవడాన్ని మా కళ్ళతో చూశాం. కళ్ళు పోగొట్టుకున్న ఆ పిల్లల్ని చూశాం. వారి చూపు ఇక తిరిగి ఎన్నటికీ రాదు. అందుకనే నేను అత్యంత విశ్వాసంతో, పరిస్థితులకు ప్రభావితుణ్ణై ఈ లేఖ మీకు వ్రాస్తున్నాను. మీకు గనక నా ఈ లేఖ ముట్టినట్లయితే, మీరు దీన్ని చదువుతారని తప్పకుండా ఏదో ఒక ఉపశమనం చేస్తారని నాకు ఆశ ఉంది. కాని ఈ లేఖ మీకు ముడుతుందా ? అదే విషయంలోనే నాకు అనుమానం ఉంది. అందుకనే నేను దీన్ని ”చౌధీ దునియా” అనే పత్రికలో ప్రచురిస్తున్నాను. సత్యం, యదార్థం ఏదో, ఎవరో ఒకరు మీకు తెలుపాలిగా !

ప్రధానమంత్రిగారూ ! ఒక విచిత్ర విషయాన్ని మీకు తెలుపుతున్నాను. శ్రీనగర్‌లో నాతో కలిసిన ప్రతి వ్యక్తి అటల్‌ బిహారి వాజ్‌పాయిని పొగుడ్తూ ప్రశంసిస్తూనే కనిపించాడు. అక్కడి ప్రజలకు కేవలం ఒకే ఒక ప్రధానమంత్రి పేరు జ్ఞాపకముంది అది అటల్‌ బిహారి వాజపాయి. పాకిస్తాన్‌ వైపు స్నేహ హస్తం చాపుతానని ఆయన చెప్పారు. కాశ్మీరు వారు ఆయన్ను కాశ్మీర్‌ సమస్యల్ని పరిష్కరించదలచిన ఆప్తునిగా, శ్రేయోభిలాషిగా జ్ఞాపకం చేసుకుంటారు. అటల్‌ బిహారీ వాజపాయి కాశ్మీరు ప్రజల దుఃఖభాదల్ని అర్థం చేసుకున్నవారని, ఆయన కాశ్మీరు ప్రజల అశ్రువుల్ని తుడువ దలచిన వ్యక్తిగా వారు ఆయన్ను జ్ఞాపకం చేసుకుంటారు. ప్రధానమంత్రిగారూ ! వారు మీతో కూడా ఇలాంటిదే ఆశిస్తున్నారు. కాని వారికి నమ్మకం కలగటం లేదు. వారెందుకు నమ్మలేక పోతున్నారంటే మీరు ప్రపంచమంతా తిరుగుతున్నారు. మీరు లావోస్‌, చైనా, అమెరికా, సవూది అరేబియా ప్రతి చోటికి వెళుతున్నారు. ప్రపంచమంతటా తిరిగిన మొదట ప్రధాన మంత్రిగా గుర్తించబడ్డారు. కాని మీ దేశంలోనే అరవై లక్షల మంది మీ పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఈ అరవై లక్షల మంది అసంతృప్తికి కారణం మీరు భారతీయ జనతాపార్టీకి చెందిన వారవటం కాదు. వారు అసంతృప్తులు అవటానికి కారణం మీరు భారతదేశానికంతటికీ ప్రధానమంత్రులు, కాని ఆ ప్రధాన మంత్రి హృదయంలో తన వేగంలోని ఈ అసంతృప్తి ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉండాల్సిందో, అదిప్పుడు కనిపించడం లేదు. అందుకని మేము విన్న వించుకునేదేమిటంటే మీరు స్వయంగా కాశ్మీరు వెళ్ళండి. అక్కడి ప్రజలతో కలవండి. పరిస్థితుల్ని అవగాహన చేసుకోండి. ఆ తరువాత ముందడుగు వేయండి. కాశ్మీరు ప్రజలు మీరు చాచిన హస్తాన్ని హృదయాలకు హత్తుకుంటారంటే నమ్మండి. కాని మీరు అక్కడ కాశ్మీరులోని ప్రతి వర్గం వారితో మాట్లాడండి, హురియత్‌ వారితో కూడాను.

ప్రధానమంత్రిగారూ ! ప్రఖ్యాత కాలమిస్ట్‌, రచయిత, టెలివిజన్‌పై రాజకీయ విశ్లేసకుడు అయిన అశోక్‌ వాన్‌ఖేడె గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, పరిశోధకుడు, టెలివిజన్‌ తెరపై తరచుగా కనబడే ప్రొఫెసర్‌ అభయ్‌ దూబే గారు – వీరిద్దరూ నా వెంట ఉన్నారు. మేము ముగ్గురం కాశ్మీరు పరిస్థితుల్ని తిలకించి ఎన్నో సార్లు ఏడ్చేశాం. మాకనిపించిందేమిటంటే మొత్తం దేశంలో ఒక విషయాన్ని వ్యాపింపజేయడం జరిగింది. ప్రతి వ్యక్తి పాకిస్తానీయుడే. కాశ్మీరులోని ప్రతి వ్యక్తి దేశద్రోహి. ఇంకా వీళ్ళంతా పాకిస్తాన్‌ వెళ్ళదలచిన వారే, కాదు, ప్రధానమంత్రిగారూ ! ఇదెంత మాత్రం వాస్తవం కాదు. కాశ్మీరు ప్రజలు తమకు భుక్తిని కోరుతున్నారు, కానీ గౌరవప్రదంగా కోరుతున్నారు. దీనితో పాటే వారు బీహార్‌, బెంగాల్‌, అసాం వారితో ఎలా వ్యవహరిస్తారో తమ పట్లకూడా అలాగే వ్యవహరించాలని కోరుతున్నారు. ప్రధాన మంత్రిగారూ ! ఇంకొక విషయం మేము కనుగొన్న దేమిటంటే కాశ్మీరు ప్రజలకు – ముంబాయి ప్రజలలాగా, పాట్నా ప్రజలలాగా, ఆహ్మదాబాద్‌ ప్రజలలాగా, ఢిల్లీ ప్రజలలాగా జీవించే మరియు వ్యవహరించే హక్కును ఇవ్వలేమా ? మనం 370 ను సమాప్తం చేస్తాం, 370 సమాప్తం కావాలి అంటూ దేశమంతటిలో ప్రచారం చేస్తున్నాం. కాశ్మీరు ప్రజల్ని మానవేతరులుగా మార్చే ప్రచారం చేస్తున్నాం. కాని మన దేశప్రజలకు ఒక విషయం మాత్రం మనం తెలుపం. కాశ్మీరు మన దేశంలో ఒక భాగంగా ఎన్నడూ లేదనేది భారత ప్రభుత్వం అంగీకరించిందని, 1947 లో కాశ్మీరును మనలో కలుపుకున్నప్పుడు మనం రెండు పక్షాల మధ్య ఒప్పందం చేసుకున్నామని దేశ ప్రజలకు ఎందుకని తెలుపం ? కాశ్మీర్‌ మన రాజ్యాంగ భాగము కాదు, కాని మన రాజ్యాంగ వ్యవస్థలో స్వయం నిర్ణయాధికారానికి ముందు ఆర్టికల్‌ 370 ఇవ్వటం జరిగింది. ప్రధాన మంత్రిగారూ ! ఆర్టికల్‌ 370ని ఎన్నడూ ముట్టుకోమని, అందులో ఎలాంటి హస్తక్షేపం జరుగదని వారికి చెప్పలేమా ? అసలు ఆర్టికల్‌ 370 అంటే ఏమిటి ? ఆర్టికల్‌ 370 లో చెప్పబడిన విషయం ఏమిటంటే కాశ్మీరు విషయంలో విదేశీ వ్యవహారాలు, సైన్యం (అంటే రక్షణ వ్యవహారం) మరియు కరెన్సీలు – ఇవి తప్పించి మేము కాశ్మీరు ప్రభుత్వ అంతరంగిక వ్యవహారాల్లో ఎలాంటి జోక్యం చేసుకోము. కాని గడచిన 65 సంవత్సరాల సాక్ష్యం ఏమిటంటే మనం అనగా ఢిల్లీ ప్రభుత్వం అక్కడ అన్యాయంగా అనర్హంగా జోక్యం చేసుకుంటూ వచ్చింది. సైన్యానికి సరిహద్దులు కాపాడమని చెప్పండి.

ఎవరైనా సరిహద్దుల్ని అతిక్రమించటానికి ప్రయత్నిస్తే వారి పట్ల తీవ్రవాది లేక శత్రువుతో ఎలా వ్యవహరిస్తారో అలా వ్యవహరించమనండి. కాని సామాన్య ప్రజల్ని శత్రువులుగా పరిగణించకండి. కాశ్మీరు ప్రజలకు మన దేశం పట్ల ఆక్షేపణ, దుఃఖబాధలున్నాయి. వారి బాధను, వారి దుఃఖాన్ని వారిలా తెలుపుకుంటారు. ”ఇంత గొప్ప జాట్‌ నిరసన ఉద్యమం నడిచింది. ఒక్కతుపాకి పేలలేదు, ఏ ఒక్కడు మరణించలేదు. గుజ్జర్ల నిరసన, ఆందోళన జరిగింది. ఏ ఒక్కడూ మరణించలేదు. పోలీసులు ఎవరిపై కూడా తుపాకి పేల్చలేదు. ఇప్పుడిప్పుడే, ఇటీవలె కావేరి జల వివాదం పై కర్ణాటక, బెంగళూరులో గొప్ప ఆందోళన, నిరసన కార్యక్రమాలు జరిగాయి. కాని ఒక్క తుపాకులు పేలుతాయి ? నడుము పై భాగానికే గురిపెట్టి ఎందుకు కాల్పులు జరుపుతారు ? 6 సంవత్సరాల పసిపిల్లలపై ఎందుకని తుపాకులు పేలుతాయి ? ప్రధాన మంత్రిగారూ ! 6 సంవత్సరాల పసిపిల్లవాడు ఎందుకని మనకు వ్యతిరేక అయిపోయారు ? అక్కడి పోలీస్‌ ఫోర్స్‌ కూడా మనకు వ్యతిరేకంగానే ఉంది.

ప్రజల హృదయాలు గెలుచుకునే అవసరముంది. ఇంకా మీరలా చేయగలుగుతారు. మీరు ప్రజల హృదయాలు గెలుచుకున్నారు, అందుకే ప్రధాన మంత్రి అయ్యారు. ఇంకా ఊహించనలదిగాని ఆధిక్యతతో ప్రధానమంత్రి అయ్యారు. దేవుని ద్వారా ప్రసాదించబడిన, చరిత్ర ద్వారా ఇవ్వబడిన, సమయం ద్వారా ఇవ్వబడిన ఈ అవకాశాన్ని, ఈ బాధ్యతను మీరు నెరవేర్చలేరా ? కాశ్మీరు ప్రజల హృదయాల్ని కూడా గెలుచుకొండి. వారి పట్ల జరిగిన పక్షపాత మరియు అమానవీయ వ్యవహారం నుండి వారికి విముక్తి కలిగించండి. వారి హృదయాల్లో, వారు కూడా ప్రపంచంలోని, భారతదేశంలోని, ఏ ఇతర రాష్ట్రంలోని ప్రజలు ఎలా గౌరవప్రదమైన పౌరులో, వారూ అలాంటి పౌరులే అనే భావనల్ని నింపేయండి. సమాయన్ని వ్యర్థపరచకుండా కాశ్మీర్‌ ప్రజల హృదయాలు గెలవటానికి సముచితమైన అన్ని చర్యలు తీసుకుంటారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇవియే కాకుండా ఎలాంటి జాప్యం లేకుండా మీ పార్టీ వారిని, మీ ప్రభుత్వంలో ఉన్నవారిని, కాశ్మీర్‌ ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలనే విషయం కూడా ఆదేశిస్తారని ఆశిస్తున్నాను. మరోసారి మీకు విన్నవించుకునే దేమంటే నా ఈ లేఖకు మీరు జవాబిచ్చినా ఇవ్వకపోయినా కాశ్మీర్‌ ప్రజల దుఃఖ బాధల నివారణ కోసం వారి అశ్రువులు తుడవడానికి మీరు తగిన చర్యలు చేపట్టాలని మనవి చేస్తున్నాను.

(25-09-2016. మున్సిఫ్‌ .. సౌజన్యంతో)  – అనువాదం – అబుల్‌ ఫౌజాన్‌