కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా: మహిళ మృతి

share on facebook

సంగారెడ్డి,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  జిల్లాలోని గుమ్మడిదల మండలం దోమడుగులో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోకు కుక్క అడ్డు వచ్చింది. దీంతో ఆటో డ్రైవర్‌ కుక్కను తప్పించబోగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సవిూపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

Other News

Comments are closed.