కుర్చీకోసం అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి

share on facebook

– అన్ని పార్టీలు కలిసొచ్చినా మేం ఒంటరిగానే ఓడిస్తాం
– ఏపీకి ¬దా ఇస్తే తెలంగాణకు అన్యాయం జరగదా?
– కోదండరాం తనను తాను గొప్పగా ఊహించుకున్నాడు
– తెలంగాణకు అమిత్‌షా పైసా సాయం చేయలేదు
– ఆపద్దర్మ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
సిద్ధిపేట, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : కుర్చీ కోసం అన్ని పార్టీలు కలుస్తున్నాయని, అన్ని పార్టీలు కలిసి గుంపుగా వచ్చినా తాము సింగిల్‌గానే ఓడిస్తామని హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్ధిపేట జి/-లా గుర్రాలగొంది గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ గెలిస్తే ఆంధ్రాకు ప్రత్యేక ¬దా ఇస్తామని రాహుల్‌ గాంధీ అంటున్నారని, ఏపీకి ¬దా ఇస్తే తెలంగాణకు అన్యాయం జరగదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలు అధికారం కోసం చంద్రబాబుతో కలిసి  తెలంగాణకు
అన్యాయం చేస్తున్నందుకు ఓటేయ్యాలా అని అన్నారు. పార్టీ పెడితే దేశమంతా తన వైపు ఉంటారన్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఇప్పుడు సీట్లు కోసం కాంగ్రెస్‌ ముందు పొర్లు దండాలు పెడుతున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ నీడలో ఎదిగిన కోదండరాం తనకు తాను గొప్పగా ఉహించుకున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణకు అమిత్‌షా పైసా సాయం చేయలేదన్నారు. 50 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా ప్రాజెక్టుకు జాతీయ ¬దా ఇచ్చారా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. గుర్రాలగొంది గ్రామంలో రూ. 30,218 ఇచ్చి ఊరంతా ఒక్కటై తామంతా టీఆర్‌ఎస్‌ వైపు ఉంటామని, కారు గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తామని చెప్పారని హరీష్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనని అన్నారు. గుర్రాలగొంది గ్రామం ఒక కొత్త దశాదిశాన్నిచ్చిందన్నారు. ఓట్లు వచ్చాయంటే లీడర్లకు ఖర్చులు అవుతాయని, నిద్రపోకుండా బాగా తిరుగుతారని, కానీ సిద్ధిపేటలో మాత్రం ఓట్లు వచ్చాయంటే పండుగ వాతావరణ ఉంటుందని హరీష్‌రావు అన్నారు. ప్రజలు ఊరూరా పిలిచి బతుకమ్మలతో, బోనాలతో స్వాగతం చెప్పి మేము ఉన్నాం విూ వెంట అని చెప్పి నేడు ఒక గ్రామం రూ. 30,218 ఇచ్చి, ఏకగ్రీవ తీర్మానం చేసి, మేమే విూకు అన్నం పెడతామని చెప్పి ఆశీర్వదించడమంటే… ఇది మామూలు విషయం కాదని అన్నారు. రాజకీయాల్లోనే ఒక కొత్త మార్పును గుర్రాలగొంది గ్రామం చూపిందని హరీష్‌రావు కొనియాడారు. ఏదడిగినా కాదనకుండా రవీందర్‌ రావు మనకొక శ్రీమంతుడుగా దొరికారని అన్నారు. ఆయన కొంత తోడ్పాటు కేసీఆర్‌ ఆశీస్సులని ఆయన అన్నారు. కష్టాల్లో, సుఖాల్లో కలిసి పనిచేసుకున్నామని అన్నారు. పేద, బడుగు, రైతుల కోసం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని, ప్రాజెక్టు పనులు చేపట్టారని, 90శాతం పనులు అయిపోయాయని హరీష్‌రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నేతలు పాల్గొన్నారు.

Other News

Comments are closed.