కెసిఆర్‌కు మద్దతుగా ప్రచారం

share on facebook

అభివృద్దిని చూసి ఓటేయాలని వినతి
సిద్దిపేట,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ భూంరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి ప్రచారంలో కోరారు.  ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నాలుగేండ్ల కాలంలో సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…స్థిర నివాసం లేని కటుంబాలకు డబుల్‌బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇవ్వాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆశయమన్నారు. వ్యవసాయ రంగంలో కొనసాగుతున్న రైతులు ఆర్థికంగా ఎదుగాలన్న సదుద్దేశంతో రైతుబంధు, రైతుబీమా అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి కారుగర్తుకే ఓటేయాలని ఓటర్లను కోరారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తూ, కారుగుర్తుకు ఓటేసి సీఎం కేసీఆర్‌ను గెలిపించుకోవాలని ఓటర్లను అభ్యర్థించారు. వితంతువులు, వృద్ధులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు నెలనెలా పింఛన్‌లను అందజేస్తూ సీఎం కేసీఆర్‌ ఆసరాను కల్పిస్తున్నారన్నారు.

Other News

Comments are closed.