కెసిఆర్‌ అసెంబ్లీ రద్దుపై నిరసన

share on facebook

ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ యువకుడు
హైదరాబాద్‌,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి): రాజ్‌ భవన్‌ ఎదుట ఓ వ్యక్తి కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.  తెలంగాణ అసెంబ్లీ రద్దుకు కెసిఆర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి నిరసనగా ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.  నల్గొండ జిల్లా నార్కట్‌ పల్లి మండలానికి చెందిన ఈశ్వర్‌ అనే నిజాం కాలేజీ ఓల్డ్‌ స్టూడెంట్‌ రాజ్‌ భవన్‌ గేటు ముందు తనతో తెచ్చుకున్న కిరోసిన్‌ ను ఒంటిపై పోసుకొని నిప్పు అంటించుకునే ప్రయత్నంలో అక్కడే వున్న రాజ్‌ భవన్‌ సిబ్బంది అతని యత్నాన్ని అడ్డుకున్నారు. అతని చేతిలోని అగ్గిపెట్టెను  లాక్కోవడంతో  పెద్ద ప్రమాదం తప్పింది. తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించి కొట్లాడి సాధించుకున్నాము. అలాంటి తెలంగాణకు ముఖ్యమంత్రి కెసిఆర్‌  ఏం చేశాడో చెప్పాలి. ఏం చేశాడని అసెంబ్లీని రద్దు చేస్తున్నారో చెప్పాలంటూ ఈశ్వర్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు.

Other News

Comments are closed.