కెసిఆర్‌ ఆదేశాల మేరకు స్వఛ్చ కార్యక్రమాలు

share on facebook

15న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో శ్రమదానాలు: జూపల్లి

నాగర్‌కర్నూల్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 15 న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో శ్రమదాన కార్యక్రమం ప్రారంభిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పట్టణంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కొల్లాపూర్‌ లోని మినీ స్టేడియంకు అదనంగా రూ. 2.5 కోట్లు మంజూరు చేశామని మంత్రి జూపల్లి చెప్పారు. రత్నగిరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అనేక మంది విద్యార్థులకు కానిస్టేబుల్‌, వీఆర్వో, టెట్‌ పరీక్షల కోసం ఉచితంగా కోచింగ్‌ ఏర్పాటుచేశామని తెలిపారు. రాష్టంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ హరిత హరంలో భాగంగా మొక్కలు నాటాలని మంత్రికృష్ణారావు కోరారు.

 

 

 

Other News

Comments are closed.