కెసిఆర్‌ కుటుంబానికి శంకరగిరి మాన్యాలు తప్పవు

share on facebook

ప్రైవేట్‌ విద్యాసంస్థల సదస్సులో రమణ

నల్లగొండ,నవంబర్‌3(జ‌నంసాక్షి): ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్‌ పాలన సాగుతోందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ అన్నారు. కేసీఆర్‌ ఓయూకు వెళ్లలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. మార్పు

కోసం.. మనుగడ కోసం అంటూ ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో పరిరక్షణ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఎల్‌. రమణ, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పల్లా వెంకట్‌ రెడ్డి, జాక్‌ చైర్మన్‌ రమణా రెడ్డి, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడిన రమణ.. కేసీఆర్‌ ఆశీర్వాద సభలన్నీ తిరస్కరణ సభలుగా మారాయని అన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులపై ప్రజలు తిరగబడుతున్నారని అన్నారు. ఈ ఎన్నికల ద్వారా కేసీఆర్‌ కుటుంబానికి శంకరగిరి మాన్యాలే గతి అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ నియంత..ఆయనిది నియంతృత్వ భావం అని మరో నేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. బానిస మనస్తత్వంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి మాయమాటలతో వస్తున్న కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

 

 

Other News

Comments are closed.