కెసిఆర్‌ జాతకాల పిచ్చి రాష్ట్రాన్ని ముంచింది

share on facebook

రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు

మండిపడ్డ రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి):

సీఎం కేసీఆర్‌ జాతకాలను పక్కాగా నమ్ముతారని, అయితే ఏ శాస్త్రి చెప్పిన జాతకం నమ్మారో కానీ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టారని రాజీనమా చేసిన ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి విమర్శలు సంధించారు. వాస్తుశాస్త్రం, సంఖ్యల నమ్మకాలు ఇలా కేసీఆర్‌ అన్ని ముహూర్తాల ప్రకారమే నడుస్తారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ను ఎద్దేవా చేశారు. హస్తసాముద్రికం, చిలకజోస్యం, గవ్వలను నమ్ముకుని తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించాలనుకోవడం సీఎం కేసీఆర్‌ అవివేకానికి నిదర్శనమని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి విమర్శించారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం, విూడియాతో ఆయన మాట్లాడుతూ, ‘ఏ శాస్త్రిగారు ఏం చెప్పారో! ఆ పిచ్చిలో పడి, రాష్ట్రాన్ని గాలికొదిలేశారు. కేసీఆర్‌ పిచ్చి పరాకాష్టకు చేరుకుంది. అసలు, కేసీఆర్‌ కు జాతకాలు చెప్పే వాల్ళెవరో, ఆయన జాతకం బాగోలేకపోతే, రాష్ట్రం జాతకాన్ని కూడా సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. ఇట్లాంటి పిచ్చోడున్న సభలో.. సభకు, సభ్యులకు, ప్రజాస్వామ్య విలువలకూ గౌరవం లేదు. చట్టాలు, శాసనాల పట్ల వారికి అవగాహన ఉందో లేదో?’ అని ప్రశ్నించారు. అందుకే ముందే తాను రాజీనామా సమర్పించానని అన్నారు.

Other News

Comments are closed.