కెసిఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టండి

share on facebook

పంటలు పండించి సస్యవిప్లవం తేవాలి

సిద్దిపేట,జూలై27(జ‌నంసాక్షి): తెలంగాణలో రైతుకు స్వర్ణయుగంగా మారిందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. రైతుబందు, బీమా పథకలంతో పాటు, నిరతంర విద్యుత్‌ పెద్ద భరోసా ఇచ్చిందన్నారు. సాగు సహాయాన్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయాన్ని సుసంపన్నం చేయాలని అన్నారు. తద్వారా అధిక ఉత్పత్తులు సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే వ్యవసాయ రంగంలో నంబర్‌వన్‌గా నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఇదిలావుంటే రైతులకు వచ్చే నెల నుంచి రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. వానాకాలం సీజన్‌కు ముందుగానే రైతులు వారికి ఇష్టమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే అవకాశం లభించిందని అన్నారు. రైతులు ప్రభుత్వం అందజేస్తున్న పెట్టుబడి డబ్బులను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ప్రయోజనం పొందాలని, సిఎం కెసిఆర్‌కు అండగా నిలవాలని సూచించారు. రైతులు ఇష్టానుసారంగా ఎరువులను వాడి డబ్బులు వృథా చేసుకోవద్దని వ్యవసాయ క్లస్టర్‌ పరిధిలో భూసార పరీక్షలు నిర్వహించుకుని వాటి ఆధారంగా ఎరువులను పంటలకు వినియోగించాలని కోరారు. మూలనపడ్డ కులవృత్తులకు జీవం వస్తోంది. రైతులు బాగుపడితే మొత్తం గ్రామమే బాగుపడుతుంది. తెలంగాణలో ఇదే

జరగబోతున్నది. ఆరు దశాబ్దాల పోరాటం,అమరుల త్యాగ ఫలితం, సిఎం కేసిఆర్‌ నాయకత్వంలో ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకునేందుకు సిఎం కేసిఆర్‌ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. గత నాలుగేళ్లలోనే తన పరిపాలన దక్షతతో చేపట్టిన పథకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయని అన్నారు.

Other News

Comments are closed.