కెసిఆర్‌ పథకాలు ఆదర్శం: ఎమ్మెల్యే

share on facebook

నిర్మల్‌,డిసెంబర్‌14(జనం సాక్షి ): ఆర్థికమాంద్యం ఉన్నా ఐదేళ్లలో రాష్టాన్న్రి ముందుకు నడిపించిన ఘనత సిఎం కేసీఆర్‌కే దక్కిందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ అన్నారు. జిల్లాలో సింగరేణి వెలుగునిచ్చే పరిశ్రమ అని, డీఎంఎఫ్‌ నిధులతో జిల్లాను అభివృద్ధి చేస్తామని తెలిపారు. జిల్లా అంతా గిరిజన ప్రాంతం కావడం వల్ల పట్టణ ప్రాంతాల్లో 1/70 సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. జిల్లా అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు వెళ్తానని చెప్పారు. ప్రతీ గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పట్టణ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోయేలా ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ప్రజల్లో చిరస్థాయిగా ఉండేలా ప్రజా సేవలకు అంకితమయ్యారన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు దేశంలో ఎక్కడా లేవని, దేశం అంతా తెలంగాణ వైపు చూస్తోందన్నారు.

Other News

Comments are closed.